సెలబ్రిటీలకు సంతోషాలు తప్పించి.. వారికి మామూలు వారి మాదిరి కష్టాలు.. సమస్యలు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ.. తరచి చూస్తే అర్థమయ్యేదేమంటే.. ప్రముఖుల కంటే సామాన్యులే ఎంతో సుఖంగా బతికేసే అవకాశం ఉంటుంది. ప్రముఖ సింగర్ మాళవిక మాటల్ని వింటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది.
ప్రేమిస్తున్నానంటూ ఒక అజ్ఞాతవాసి ఆమెను పెట్టిన టార్చర్ వింటే చెమటలు పట్టటం ఖాయం. ఫోన్లతో అతగాడు పెట్టిన హింస ఆమె మాటల్లోనే వింటే.. అయ్యో అనిపించక మానదు. తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న టార్చర్ ను ఆమె చెప్పారు.
ఆ ఎపిసోడ్ ను ఆమె మాటల్లోనే.. "అతనెవరో నాకూ తెలియదు. అయితే, చాలా ఇబ్బంది పెట్టాడు. ఒకరకంగా టార్చర్ చేశాడు. నేను పాటలు పాడటానికి వెళ్లినప్పుడు నా వెంటే మా అమ్మ కూడా వచ్చేది. నా ప్రోగ్రామ్ లకు సంబంధించిన ఫోన్లు మా అమ్మే మాట్లాడేవారు. అతను రోజూ ఫోన్ చేస్తుండేవాడు. ఇండస్ట్రీలో కెమెరా డిపార్ట్ మెంట్ కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లకు ఊరికే చేస్తున్నాడని మాకు అర్థమైంది. అనవసరంగా గొడవ పెట్టుకోవడం ఎందుకని సైలెంట్ గా ఉన్నాం. రోజూ ఫోన్ల మీద ఫోన్లు - ఎస్ ఎం ఎస్ లు చేసేవాడు. మేము దాన్ని సీరియస్ గా తీసుకోలేదు"
"ఒకరోజు ఏదో ప్రోగ్రామ్ కోసం నేను - గీతామాధురి - నటుడు శివారెడ్డి - అభినయ్ కృష్ణ వెళ్లాం. సడెన్ గా ఒక మెస్సేజ్ వచ్చింది. సౌందర్య బర్త్ డే.. డెత్ డే.., వైఎస్ రాజశేఖర్ రెడ్డి బర్త్ డే.. డెత్ డే - ఇలా సెలబ్రిటీల పుట్టిన రోజులు.. చనిపోయిన రోజులు రాసి చివరకు ‘మాళవిక బర్త్ డే.. రాసి డెత్ డే’ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. నాకు చాలా భయం వేసింది"
ఆ మెస్సేజ్ ని శివారెడ్డి - అభినయ్ కృష్ణలకు చూపించా. వాళ్లు నాకు ధైర్యం చెప్పి - వేరే ఫోన్ నుంచి అతని నెంబర్ కు కాల్ చేసి - ‘డీఎస్పీని మాట్లాడుతున్నా.. మాళవిక మీపై కేసు పెట్టారని కాస్త గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతే అప్పటి నుంచి మళ్లీ నాకు ఫోన్ చేయలేదు" అని చెప్పుకొచ్చారు. నిజంగానే టార్చర్ కదూ!