పవన్‌ 27 పుకార్లకు చెక్‌ పెట్టిన జయరామ్‌

Update: 2020-06-04 08:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ అజ్ఞాతవాసి తర్వాత దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుని ఆమద్య ఒకేసారి మూడు సినిమాలకు కమిట్‌ అయ్యాడు. అందులో 26వ చిత్రం వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ విపత్తు తలెత్తకుండా ఉండి ఉంటే వకీల్‌ సాబ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఉండేది. తదుపరి చిత్రం క్రిష్‌ దర్శకత్వంలో ప్రారంభం అయ్యి సగానికి పైగా పూర్తి అయ్యేది. క్రిష్‌ పీరియాడిక్‌ డ్రామాగా పవన్‌ కళ్యాణ్‌ తో సినిమాను చేసేందుకు అంతా సిద్దం చేసి.. పవన్‌ లేకుండా కొన్ని రోజులు షూటింగ్‌ కూడా చేశాడు.

సినిమా ఆలస్యం అవ్వడంతో పాటు కొన్ని కారణాల వల్ల క్రిష్‌ తో పవన్‌ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పవన్‌ మళ్లీ రాజకీయాలతో బిజీ అవ్వాల్సిన సమయం వచ్చింది. అందుకే వకీల్‌ సాబ్‌ చిత్రాన్ని పూర్తి చేసి మళ్లీ సినిమాలకు గ్యాప్‌ తీసుకోవాలని భావిస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ పుకార్లు పవన్‌ ఫ్యాన్స్‌ కు ఆందోళన కలిగించాయి. కాని అవి కేవలం పుకార్లే అని నిజం కాదంటూ క్యారెక్టర్‌ ఆర్టిస్టు జయరామ్‌ మాటలతో క్లారిటీ వచ్చేసింది.

అల వైకుంఠపురంలో చిత్రంతో పాటు ఎన్నో పెద్ద తెలుగు సినిమాల్లో.. స్టార్‌ హీరోల చిత్రాల్లో నటించిన నటుడు జయరామ్‌ తాజాగా ఒక చోట మాట్లాడుతూ పవన్‌ 27 మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను కమిట్‌ అయ్యి ఉన్న సినిమాల్లో పవన్‌.. క్రిష్‌ ల మూవీ ఒకటి అన్నాడు. 18వ శతాబ్దంకు చెందిన కథతో రూపొందబోతున్న ఆ సినిమాలో భారీ ఎత్తున నటీనటులు నటించాల్సి ఉంది. అందుకే ఈ ఆంక్షలు అన్ని ఎత్తి వేసిన తర్వాతే ఆ సినిమా ప్రారంభం అవుతుందన్నాడు. జయరామ్‌ మాటలతో పవన్‌ మూవీ ఈ ఏడాది చివరి వరకు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ లోపు వకీల్‌ సాబ్‌ చిత్రం పూర్తి చేసి విడుదల చేసే అవకాశం ఉంది.
Tags:    

Similar News