మాజీ హీరోయిన్ చెప్పిన పడక నిజాలు

Update: 2018-07-04 09:31 GMT
మల్లికా శరావత్. నిన్నటి తరం సెక్స్ బాంబ్. ఇప్పుడంటే సోషల్ మీడియాలో మోడల్స్ విచ్చలవిడిగా ఫోటో షూట్లతో పాపులారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ అవేవి లేని రోజుల్లో మల్లికా శరావత్ ఓ రేంజ్ లో బాలీవుడ్ ఐటెం సామ్రాజ్యాన్ని ఏలింది. టాలెంట్ కు పదును పెడుతూ ఛాలెంజ్ చేసే పాత్రలు చేస్తూనే మరోవైపు హాట్ హాట్ ఇంటిమేట్ సీన్స్ లో ఒళ్ళు దాచుకోకుండా కష్టపడటం ఏకకాలంలో చేయటం తనకే సాధ్య పడింది. బోల్డ్ గా దాదాపు నగ్నంగా అనిపించేలా మల్లికా శెరావత్ నటించిన మర్డర్ సినిమాను అప్పట్లో హిందీ రాని వాళ్ళు కూడా ఎగబడి చూశారంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి దాన్ని తెలుగులో డబ్ చేసే దాకా మనవాళ్ళు వదల్లేదు. కాస్టింగ్ కౌచ్ వివాదం పరిశ్రమను కుదిపేస్తున్న తరుణంలో తన చేదు జ్ఞాపకాలు పంచుకుంది మల్లికా శెరావత్. కెరీర్ మొదట్లో తనకు నరకం చూపించారని అర్ధరాత్రి అనే విచక్షణ లేకుండా 3 గంటల సమయంలో గెస్ట్ హౌస్ కు రమ్మన్న దర్శకుడు ఉన్నారని గుర్తుచేసుకుంది. ట్విస్ట్ ఏంటంటే అతను ఇంకా పరిశ్రమలోనే ఉన్నాడట.

సినిమాల్లో నటించే సమయంలో స్క్రీన్ తో పాటు బయట కూడా ప్రైవేట్ స్పేస్ లో ఇలాగే చేయమని అడిగిన హీరోలు ఉన్నారని చెప్పిన శెరావత్ షాక్ ఇచ్చింది. సినిమాల్లో ఉన్నట్టు తమతో పర్సనల్ గా కూడా అలాగే ప్రవర్తించమనే హీరోల వల్ల చాలా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందట మల్లికా. తర్వాత సినిమాలు చేయటం మానుకున్న మల్లికా లిప్ లాక్ కిస్సులు సెక్సీ గ్లామర్ షోలు నిజ జీవితంలో చేయలేకే పరిశ్రమ వదిలి వెళ్ళిపోయినట్టు బాధ పడింది. నిజానికి మల్లికానే కాదు ఎందరో హీరోయిన్ల నిజ కథ ఇది. అందరు బయట చెప్పుకోరు కాబట్టి  అవకాశాల కోసం రాజీ పడి సర్వం అర్పించుకున్న హీరోయిన్లకు కొదవ లేదు. త్వరలో రీ ఎంట్రీ ఇస్తానంటున్న మల్లికా మూడేళ్ళ క్రితం చేసిన సినిమా తప్ప మళ్ళి ప్రయత్నం చేయలేదు. కష్టపడి ఓ స్థాయికి వచ్చానని చెబుతున్న మల్లికా  ఒకదశలో బాలీవుడ్ లో హద్దులు మీరిన అంగాంగ ప్రదర్శనకు కారణమైన వాళ్లలో తను కూడా ఉంది. అది అవసరం అంటారు వాటిని చూసి  వేరు ఆలోచనలు చేసే వారిని తప్పు అంటారు. ఇది తేలే విషయం కాదు కానీ మల్లికా చెప్పిన ఆ హీరోలు దర్శకులు ఎవరా అని కొందరు గూగుల్ లో తనతో నటించిన హీరోలు దర్శకుల పేర్లను విశ్లేషించడం మొదలు పెట్టారు. అయినా ఆ పేరేదో చెబితే పోయేదిగా - ఈ నసుగుడు ఎందుకు అనవసరంగా అంటున్న వాళ్ళు కూడా లేకపోలేదు.
Tags:    

Similar News