సినిమాలు తీయాలని - పెద్ద డైరెక్టర్లు అవ్వాలని లేదా 24 శాఖల్లో ఏదో ఒక విభాగంలో గొప్ప ప్రముఖుడు కావాలని కలలు గనేవాళ్లు ఉంటారు. ఇలాంటి వాళ్లు ఏం చేయాలి? అన్నదానికి సరైన క్లారిటీ ఉండదు. నాలుగు గోడల మధ్య సినిమాలు చూస్తే సరిపోతుందని కొందరు అనుకుంటారు. మరికొందరైతే ప్రపంచ సినిమాని స్టడీ చేస్తుంటారు. సినిమా క్లబ్‌లకు వెళ్లి అధ్యయనం చేయడం - డిస్కషన్లు చేయడం - రచయితల సంఘం - దర్శకసంఘం అలయెన్స్ తో నాలెడ్జి పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఇవన్నీ మంచి ప్రయత్నాలే. వీటితో పాటే దేశ - విదేశాల్లో జరిగే సినిమా ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం ఉంటే అలాంటి చోటికి విజిట్ చేస్తే కొత్త పరిచయాలు - టెక్నాలజీ పరిచయం వంటివి సాధ్యమవుతాయి. ప్రస్తుతం ఓ రెండు సినిమా పండగలు ఇండియాలో వేడి పెంచుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై లో ఇంటర్నేషనల్ ఫిలింఫెస్టివల్ (మామి)-2018 ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు అమీర్ ఖాన్ - కిరణ్ రావు - జయా బచ్చన్ - అనీల్ కపూర్ - టబు - కునాల్ కపూర్ తదితరులు పాల్గొని ఘనంగా ప్రారంభించారు.
అలానే గోవాలో 49వ ఇఫీ ఉత్సవాలు త్వరలో ప్రారంభమవుతున్నాయి. 49వ అంతర్జాతీయ ఫిలింఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫీ)- 2018 ఉత్సవాలు నవంబర్ 20 నుంచి 28 వరకూ గోవా-పానాజీలో జరగనున్నాయన్న ప్రకటన వెలువడింది. నవంబర్ 10వరకూ ఈ ఉత్సవాల కవరేజీకి మీడియా సహా ఔత్సాహికుల్ని ఆహ్వానిస్తున్నారు. ఆసియాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ ఉత్సవాలకు మీడియాకి ప్రత్యేక ఆహ్వానం ఉందని ఇఫీ కమిటీ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి సినిమాల్ని ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఔత్సాహిక ఫిలింమేకర్స్ కి - సినిమా గురించి నేర్చుకోవాలన్న తపన ఉన్నవారికి ఇది అద్భుతమైన వేదిక. మనసుండాలే కానీ మార్గం ఉండకపోదు. ఈ ఉత్సవాల్లో పాల్గొని నాలెజ్ పెంచుకునే ప్రయత్నం ఫిలింమేకర్స్ కి ఎంతైనా అవసరం. హైదరాబాద్ లాంటి చోట అంతర్జాతీయ సినిమా ఉత్సవాలు నిర్వహించినప్పుడు అక్కడ పరిచయాలు పెంచుకుని పెద్ద స్థాయికి ఎదిగిన యువకులు ఉన్నారు. మనోళ్లు అవతార్ - గార్డియన్ ఆఫ్ ది గ్యాలాక్సీ చిత్రాలకు పని చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కేవలం కాంటాక్ట్స్ తో వచ్చే అవకాశాలెన్నో. ప్రతిభకు ఎల్లలు లేవు. ఎదగడానికి సరైన ప్రణాళిక అవసరం. ఆల్ ది బెస్ట్.