మమ్ముట్టి జీవించాడుగా

Update: 2019-02-08 10:48 GMT
పాతికేళ్ల తర్వాత ఓ పరభాషా నటుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు అందులోనూ స్వర్గీయ రాజకీయ నాయకుడి బయోపిక్ అన్నప్పుడు కొన్ని అనుమానాలు కలగడం సహజం. అయితే మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి యాత్ర రూపంలో వాటిని పూర్తిగా పటాపంచలు చేసేసాడు. దీనికి ఇంత పాజిటివ్ టాక్ రావడంలో ఆయన పెర్ఫార్మన్స్ దే సింహభాగం అని చెప్పడానికి సందేహించనక్కర్లేదు. అంతగా ఒదిగిపోయి మరీ జీవించేసారు. ఎంతగా అంటే తెరమీద చూస్తున్నది వైఎస్ఆర్ నే అని జనం ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేంతగా.

నిజానికి ఇలాంటి బయోపిక్స్ లో లీడ్ రోల్ సెలక్షన్ అన్నది చాలా ముఖ్యం. ఎంపికలో ఏ మాత్రం పొరపాటు జరిగినా మొత్తం తేడా కొడుతుంది. ఎన్టీఆర్ లో యంగ్ వేషంలో బాలయ్య మీద వచ్చిన నెగటివ్ రిమార్క్స్ ఫలితం మీద ప్రభావం చూపించాయి. అందుకే మహానాయకుడులో వేరే కుర్రాడిని తెచ్చారు. అయితే యాత్రలో ఆ చిక్కు రాలేదు. వయసు మళ్ళిన పాత్రలో మమ్ముట్టి తన కన్నా బెస్ట్ ఛాయస్ లేరు అనిపించేలా యాత్రను నిలబెట్టారు. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం విశ్వనాధ్ స్వాతి కిరణంతో పాటు సుమన్ తో సూర్యపుత్రులు అనే మల్టీ స్టారర్ చేసిన మమ్ముట్టి ఆ తర్వాత డబ్బింగ్ సినిమాల రూపంలో పలకరించే వారు కానీ గత పదేళ్లుగా అవి కూడా ఆగిపోయాయి.

 అలాంటప్పుడు మమ్ముట్టిని తెలుగు పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారా అనే డౌట్ లేకపోలేదు. అయితే చాలా సెటిల్డ్ గా మమ్ముట్టి ఇచ్చిన పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇవాళ ప్రసాద్ లాంటి హై ప్రొఫైల్ మల్టీ ప్లెక్స్ లో విజిల్స్ కేకలు వినిపిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉందనేది. పార్టీలకు అతీతంగా సామాన్య ప్రేక్షకులకు సైతం నచ్చేలా యాత్ర అనిపించడంలో ఎక్కువ క్రెడిట్ మమ్ముట్టి తీసుకున్నారు. మరి ఇకపై ఇంకొన్ని స్ట్రెయిట్ మూవీస్ చేస్తారేమో వేచి చూడాలి
Tags:    

Similar News