సంతోష్ శోభన్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన `మంచి రోజులు వచ్చాయి` చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మారుతి మార్క్ చిత్రంగా బాక్సాఫీస్ వద్ద నిలలిచింది. `లవ్ స్టోరీ`...`మోస్ట్ ఎలిజబిబుల్ బ్యాచిలర్` తర్వాత కొవిడ్ కాలంలో సక్సెస్ అయిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. మూడు రోజుల్లోనే 5 కోట్ల గ్రాస్ వసూళ్ల తో పెద్ద హిట్ గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది. ఈ సక్సెస్ సంతోష్ శోభన్ కి తొలి థియేట్రికల్ హిట్ గా నిలిచింది. మిక్సుడ్ రివ్యూలు వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా లాభాల బాటలోనే సినిమా పయనిస్తోంది.
ప్రస్తుతానికి మార్కెట్ లో ఏ సినిమా కూడా పోటీ గా లేకపోవడం మంచిరోజులొచ్చాయి కి కలిసొస్తుంది. పెద్దగా రిలీజ్ లు కూడా లేవు కాబట్టి ఈ వారంతంలో మరింత కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. దర్శకుడిగా మారుతి గురించి ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ కూడా కలిసొస్తుంది. పరిమిత బడ్జెట్ లోనే యూవీ క్రియేషన్స్ తెరకెక్కించిన సినిమా కాబట్టి వచ్చిన లాభాల్ని భారీగానే ఖాతాలో వేసుకునే ఛాన్సుందని ట్రేడ్ వర్గాలు సైతం భావిస్తున్నాయి. సంతోష్ శోభన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ప్రామిసింగ్ యాక్టర్ గా ప్రూవ్ చూసుకున్నాడు. సంతోష్ శోభన్ `పేపర్ బోయ్` సినిమాతో లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
తొలి సినిమాతోనే శోభన్ కి మంచి పేరొచ్చింది. ఏక్ మినీ కథతో మరో విజయం అందుకున్న అతడు తాజాగా మారుతి బ్రాండ్ తో మార్కెట్ లో మరింత స్ట్రాంగ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మారుతి కంటెంట్ ని నమ్ముకుని సినిమాలు చేసే దర్శకుల్లో ఒకరు. మారుతిలో ఆ ట్యాలెంట్ చూసే మెగా అల్లు అరవింద్ సహా యువీ నిర్మాతలు ఆయన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆ నమ్మకాన్ని మారుతి నిలబెట్టుకుంటున్నాడు. కొత్త వాళ్లతో సినిమాలు చేస్తూ నిర్మాతలకు రూపాయి లాభం చూపిస్తున్నారు. అన్నట్లు సంతోష్ శోభన్ దివంగత దర్శకుడు శోభన్ కుమారుడు అన్న సంగతి తెలిసిందే. `వర్షం` సినిమాతో శోభన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.