నటి యాంకర్ కం నిర్మాత మంచు లక్ష్మికి కోపం వచ్చింది. షిట్! అంటూ తిట్టేశారు. అది ఎవరిని ఎందుకని ప్రశ్నిస్తే వివరాల్లోకి వెళ్లాలి. సోషల్ మీడియాల్లో తన ట్వీట్లను తనని ద్వేషించేవాళ్లందరికీ షిట్ అని సింపుల్ గా చెక్ పెడుతూ నేటి ఉదయం స్పందించారు. ``ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ వెన్ ఐ గేవ్ ఏ షిట్!`` అంటూ వ్యంగ్యంగా వెటకారంగానే తన ట్రోలర్స్ హేటర్స్ పై స్పందించారు. నా హేటర్స్ అందరినీ అస్సలు పట్టించుకునే పరిస్థితిలో లేను! అని కూడా అన్నారు.
లక్ష్మి మంచు ఆదివారం ఉదయం తనను ద్వేషించిన వారందరికీ టోకున ఊహించని ట్వీట్ షాక్ ఇవ్వడంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది. ద్వేషం లేదా ట్రోలింగ్ తో బాధపడే మానసిక స్థితిలో తాను లేనని ఆమె చెప్పకనే చెప్పారు. అయితే లక్ష్మీ ఇంత గట్టిగా స్పందించడానికి కారణమేమిటి? అన్నది ఆరా తీస్తే.. ఇంతకుముందు కరోనా సోకిన మంత్రి కేటీఆర్ తో ట్వీట్ సంభాషణపై ట్రోల్స్ కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు.
``గెట్ వెల్ సూన్ బడ్డీ.. వాచ్ ఆల్ మై మూవీస్ నవ్`` అంటూ లక్ష్మీ మంచు మంత్రివర్యులనుద్ధేశించి ట్వీట్ చేయడంతో దానిపై నెటిజనులు వ్యంగ్యంగా స్పందించారు. సెటైర్లు విసిరారు. ``మీ సినిమాలు చూసే కంటే చచ్చిపోవడం నయం అక్కా.. మీ సినిమాలు చూస్తూ త్వరగా కోలుకోడం ఏంటక్కా..!`` అంటూ ఓ నెటిజన్ అతిగా స్పందించారు. బడ్డీ ఏంటి? అంటూ కొందరు సెటైర్లు వేశారు... నేటి ఈ స్పందనకు కారణమేమిటీ అటే.. అదీ సంగతి!!
లక్ష్మి చివరిసారిగా నెట్ ఫ్లిక్స్ తొలి తెలుగు సిరీస్ పిట్ట కథలులో నటించారు. ఆమె రాములా అనే విభాగంలో క్రూరురాలైన రాజకీయ నాయకురాలిగా నటించారు.