టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న మంచి స్నేహితులు. ఇద్దరి వీడియోలు మరియు ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి వీరిద్దరి విషయం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆహా భోజనంబు అంటూ మంచు లక్ష్మి కుకింగ్ షో ను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే తన స్నేహితురాలు రకుల్ తో మంచు లక్ష్మి షో చేసింది. తాజా ఎపిసోడ్ లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హాజరు అయ్యాడు. వంట ఏమీ రాని ఆనంద్ దేవరకొండ చేసిన విన్యాసాలతో షో ఆద్యంతం సరదాగా సాఫీగా సాగింది. ఆ సమయంలో మంచు లక్ష్మి పలు విషయాలను షేర్ చేసుకుంది.
మంచు లక్ష్మి మరియు రకుల్ లు ఇద్దరు కూడా భోజన ప్రియులు. రకుల్ టేస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది కాని ఎక్కువగా తినదు. ఆమె ఫిజిక్ విషయంలో ఎక్కువ శ్రద్ద చూపిస్తూ ఉంటుంది. హీరోయిన్ కనుక ఆమెను చాలా మంది చాలా రకాలుగా విమర్శించే అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు కూడా ఫిజిక్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటుంది. ఇక మంచు లక్ష్మి కూడా మంచి ఫిజిక్ ను మెయింటెన్ చేస్తుంటారు. అలా అని ఆమె ఏమీ నోరు కట్టేసుకుని ఉండరు. మంచు లక్ష్మి బాగానే తింటారు.. అందుకు తగ్గట్లుగా వర్కౌట్ లు యోగాసనాలు చేస్తారు. అందుకే ఆమె ఎప్పటికి అలా మంచి ఫిజిక్ తో కనిపిస్తూ ఉంటారు.
తాజా ఎపిసోడ్ లో రకుల్ తో తన స్నేహం గురించి ఆనంద్ దేవరకొండతో మాట్లాడుతూ మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేము ఇద్దరం ఏదైనా మంచి వంటకం గురించి తెలిస్తే ఉదయం విమానం ఎక్కి అక్కడ తినేసి రాత్రి వరకు మళ్లీ తిరిగి వచ్చిన రోజులు చాలా ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఇద్దరం కూడా చాలా సరదాగా నచ్చిన వంటకాలను తినేందుకు ఎంత దూరం అయినా వెళ్లే వాళ్లం అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. తినడం కోసం అంత దూరం విమానంలో వెళ్లే వాళ్లం అంటూ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పటిలాగే ఆమె వ్యాఖ్యలను మీమర్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.