ప్రభాస్ నాకు కొడుకులా అనిపించాలిగా...

Update: 2016-12-07 13:30 GMT
ఆ మధ్యన నటి లక్ష్మీ మంచు ఒక కామెంట్ చేశారు. అసలు తనకు రోల్ నచ్చకపోతే చేయనని.. బాహుబలి సినిమా కూడా అందుకే వదులుకున్నా అంటూ చెప్పుకొచ్చారు. అయితే అమ్మడు నిజంగానే బాహుబలి సినిమాను అందుకే వదిలేసిందా? రాజమౌళి క్రియేట్ చేసిన రోల్ నచ్చలేదా? ఇలా చాలా సెటైర్లు ఆమెపై పడ్డాయి. అందుకే ఇప్పుడు ఒక టివి ప్రోగ్రామ్ సాక్షిగా ఆ రోల్ చేయకపోవడానికి క్లారిటీ ఏంటో ఇచ్చేసింది.

కమెడియన్ ఆలీ నిర్వహించే ఒక టివి కార్యక్రమంలో గెస్టుగా విచ్చేసిన లక్ష్మీ మంచు.. లక్ష్మీ బాంబ్ లాంటి కామెంట్స్ చేసిందిలే. ''నిజానికి నాకు బాహుబలి లో ఆఫర్ చేసిన శివగామి రోల్ నచ్చింది. కాని ఆ ఛాన్సు వదిలేసుకుంది రోల్ నచ్చక కాదు.. ప్రభాస్ కు అమ్మగా చేయడం ఇష్టం లేక. ప్రభాస్ ను చూస్తే ఎవరికైనా కొడుకు ఫీలింగ్ వస్తుందా? నాకైతే అస్సలు రాదు. పైగా ఇంకోటేదో ఫీలింగ్ వచ్చేసినా వచ్చేయవచ్చు. అందుకే చేయలేదు'' అంటూ సెలవిచ్చింది లక్ష్మీ. ఆ ఆన్సర్ విన్న ఆడియన్స్ అందరూ షాకులో ఈలలు వేసి గోల చేశారులే.

కాకపోతే బాహుబలి వంటి సినిమాలో చేసుంటే లక్ష్మీ కెరియర్ వేరొక రేంజులో టర్న్ అయ్యి ఉండేదేమో? అనగనగా ఓ ధీరుడు సినిమాలో చేసిన నెగెటివ్ ఐరేంద్రి పాత్రకంటే ఈ పాత్ర చాలా బాగుండేది. ప్చ్.. ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని ఉంటే బాగుండేది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News