ట్యాలెంటెడ్ కమెడియన్ అవసరాల శ్రీనివాస్ ఒక వైపు నటుడిగా మరో వైపు దర్శకుడిగా కొనసాగుతూ వస్తున్నాడు. ఇతర హీరోల సినిమాలో కామెడీ వేశాలు మాత్రమే వేయకుండా అప్పుడప్పుడు హీరోగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. మొత్తానికి పలు రకాలుగా అవసరాల శ్రీనివాస్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో ఒక సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు బాల రాజశేఖరుని దర్శకత్వంలో 'నాయన రారా ఇంటికి'(ఎన్.ఆర్.ఐ) అనే చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రంలో అవసరాల ఎన్నారై కుర్రాడిగా కనిపించబోతున్నాడు.
నేడు లాంచనంగా ప్రారంభం అయిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ చిత్రంలో కీలక పాత్రలో మంచు వారి అమ్మాయి మంచు లక్ష్మి కూడా నటించబోతుంది. ఆచి తూచి పాత్రలను ఎంపిక చేసుకునే మంచు లక్ష్మి ఈ చిత్రంలో నటించబోతున్న నేపథ్యంలో సినిమాకు అదనపు ఆకర్షణ జోడించినట్లయ్యింది. కీలక పాత్రల్లో మాత్రమే నటించేందుకు ఆసక్తి చూపే మంచు లక్ష్మి ఈ చిత్రంలో కాస్త విభిన్నంగా కామెడీ టచ్ ఉన్న పాత్రను చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఆ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
మొత్తానికి ఎన్నారై అవసరాలతో మంచు లక్ష్మి నటించడం కన్ఫర్మ్ అయ్యింది. అవసరాల మరియు మంచు లక్ష్మి మాత్రమే కాకుండా ఈ చిత్రంలో నాగబాబు మరియు మహతి కూడా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నటుడిగా ఇప్పటికే నిరూపించుకున్న అవసరాల శ్రీనివాస్ మరోసారి ఈ చిత్రంతో నవ్విస్తాడేమో చూడాలి. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభించి - సినిమాను సమ్మర్ తర్వాత విడుదల చేయాలని భావిస్తున్నారు.