సినిమాలు - పేజ్ త్రీ హడావుడిలతో బిజీబిజీగా గడిపేసే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయ మంచులక్ష్మీ ప్రసన్న రాజకీయాలను సైతం దగ్గరగా గమనిస్తున్నట్లున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన అంశమే అయినప్పటికీ హైదరాబాద్ ను ఓ కుదుపు కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ పై మంచు వారి అమ్మాయి మామూలు కామెంట్ చేయలేదు. రాజకీయాలతో ముడిపడి ఉన్న అంశంలో తనంతట తానుగా జోక్యం చేసుకొని సీనియర్ నేత వ్యవహారశైలిపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు మద్ధతుగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ పై పంచ్ పేల్చారు.
తెలంగాణలో కలకలం రేకెత్తిస్తున్న డ్రగ్స్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ సంచలన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ సీఎం కేసీఆర్ వారసుడు కేటీఆర్ కు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పైనా మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ``దిగ్విజయ్... విచక్షణ కోల్పోయారు. వారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయస్సుకు తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు. ఇప్పటికైనా తెలంగాణ పదం సరిగా రాయడం నేర్చుకోవడం సంతోషం`` అంటూ కేటీఆర్ శివాలెత్తిపోయారు. ఈ సంవాదంలోకి వచ్చిన మంచు లక్ష్మీ ప్రసన్న..``రామ్..సరిగ్గా చెప్పారు. ఆయన (దిగ్విజయ్ సింగ్) విచక్షణను ఎప్పుడో కోల్పోయారు`` అంటూ రీట్వీట్ చేశారు.
కాగా, సహజంగా పాలిటిక్స్ కు దూరంగా ఉండే మంచు లక్ష్మీ ప్రసన్న తాజాగా రెండు ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధంలో జోక్యం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ఘాటు కామెంట్లు చేయడం గమనార్హం. ఇదిలాఉండగా....తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ ఎస్ పార్టీ నేతలపై మంచులక్ష్మీ ప్రసన్న విరుచుకుపడి ఇప్పుడు మద్దతు ఇస్తున్నారని కాంగ్రెస్ వారు అప్పుడే కౌంటర్ కామెంట్లు మొదలుపెట్టేశారు.