మనోజ్ ప్రయత్నం తంబీలకు చేరుతుందా?

Update: 2016-10-31 22:30 GMT
ఒక్కడు మిగిలాడు టైటిల్ పై మంచు మనోజ్ కొత్త మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసిన ఎల్టీటీఈ దళం.. ఈ సినిమాకు మెయిన్ థీమ్. 8 ఏళ్ల క్రితమే ఎల్టీటీఈ హెడ్ వేలుపిళ్లై ప్రభాకరన్ ను తుదముట్టించేసినా.. ఇప్పటికీ ఈ సబ్జెక్ట్ హాట్ హాట్ గానే ఉంటుంది.

మంచు మనోజ్ ఈ సబ్జెక్ట్ పై సినిమా చేస్తున్నాడంటే.. గతంలో ఈ సబ్జెక్ట్ పై వచ్చిన కొన్ని సినిమాల మాదిరిగానే.. ఎల్టీటీఈ సభ్యుడుగా చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఒక్కడు మిగిలాడులో.. మనోజ్ చేస్తున్నది ఏకంగా ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ పాత్రే అని చెప్పేశాడు దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి. శ్రీలంకలో 15 లక్షల మంది శరణార్ధుల కోసం 1990 కాలంలో జరిగిన యుద్ధం చుట్టూనే ఈ సినిమా తిరుగుతుందని దర్శకుడు చెప్పాడు. ఇది ఓకే కానీ.. తమిళనాడులో అయితే ప్రభాకరన్ పై తీసే సబ్జెక్టుకు డిమాండ్ ఉంటుంది. కానీ మన వరకూ చూస్తే ఇతడు చేసిన యుద్ధంతో అసలు సంబంధమే ఉండదు.

అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేయడం సంఘటన మినహాయిస్తే.. తెలుగు వాళ్లకు ప్రభాకరన్ కేరక్టర్ తో అసలు లింక్ కూడా ఉండదు. మరి ఇలాంటి టిపికల్ సబ్జెక్టును తెలుగు ఆడియన్స్ ను అలరించేలా తీయడం కత్తిమీద సాముగానే చెప్పాలి. అయినా సరే.. ఓ ఇంటెన్సిటీ ఉన్న సబ్జెక్టును చేసేసి జనాల ముందుకు తెస్తున్న మంచు మనోజ్ ప్రయత్నాన్ని తెలుగు తంబీలు ఏమాత్రం అర్ధం చేసుకుంటారో? ఆదరిస్తారో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News