మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల కౌంటింగ్ వేడి పెంచుతోంది. ఈసారి మునుపెన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది ఉత్కంఠ ను పెంచింది. తాజా కౌంటింగులో పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో మంచు విష్ణు ముందంజలో ఉన్నారు.
ప్రకాష్ రాజ్ కు పోస్టల్ బ్యాలెట్ ఝలకిచ్చింది. నిజానికి ఈ విధానాన్ని ప్రకాష్ రాజ్ తొలుత వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. బ్యాలెట్ ఓట్లను కొనుగోలు చేశారని ఓటుకు నోటు ఇచ్చారని ప్రకాష్ రాజ్ ఇంతకుముందు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యమైన విధానం కాదని ఆయన ఆగ్రహించారు. ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. అయినా కానీ దానికి అనుమతి లభించింది. ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటింగు వల్ల 60 ఓట్లు అదనంగా పోలయ్యాయి.
నేటి మా ఎన్నికల్లో ఓవరాల్ గా 665 ఓట్ల వరకూ పోలవ్వడం విశేషం. 883 మందికి ఓటు హక్కు ఉండగా 200 మంది వరకూ ఓట్లు వేసేందుకు రాలేదు. ఇక జనరల్ కౌంటింగులో ప్రకాష్ రాజ్ ప్యానెల్ ముందంజలో ఉందని కౌంటింగులో తేలింది. ఇక పోలైన 665లో చెల్లని ఓట్లు 50 ఉన్నాయని కూడా చర్చ సాగుతోంది. 6 టేబుల్స్ పై ఓట్ల కౌంటింగ్ సాగుతోంది