బంగారానికే జోహార్‌ అంటున్నాడు

Update: 2015-12-31 09:40 GMT
బాలీవుడ్ మూవీ మేకర్ కరణ్ జోహార్.. సౌతిండియా దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో చేతులు కలపడం విశేషం. టాలీవుడ్ లో ఒకే బంగారం పేరుతో రిలీజ్ అయిన తమిళ మూవీ ఓకే కణ్మణిని.. ప్రస్తుతం హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్ - శ్రద్ధా కపూర్ లు నటిస్తున్నారు. మణిరత్నం సహాయకుడు షాద్ ఆలీ.. ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు.

గతంలో మణిరత్నం తీసిన సఖియా చిత్రాన్ని సాథియా పేరుతో రీమేక్ చేసిన అనుభవం ఈయనకు ఉంది. 'మణిరత్నం - గుల్జార్ సాబ్ - షాద్ లు తీస్తున్న ఓకే కణ్మణి రీమేక్ లో భాగం అయినందుకు హ్యాపీగా ఉన్నా, మణిరత్నంతో భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉంది' అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనుండగా.. గుల్జార్ పాటలు రాస్తున్నారు. ఓకే బంగారం చిత్రం మణిరత్నంకు దాదాపు దశాబ్దం తర్వాత హిట్ అందించింది. ప్రేమ కథాలు చిత్రాలు తీయడంతో మణి ఎంతటి సిద్ధహస్తుడో ప్రూవ్ చేసింది. లేటెస్ట్ ట్రెండ్ కు తగినట్లుగా, ఇప్పటి యువతరం ఆలోచనలతో తీసిన ఈ సినిమాకి కోలీవుడ్ - టాలీవుడ్ ప్రేక్షకులు  బ్రహ్మరథం పట్టారు.

ఇప్పటి యువత ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే ఈ కాన్సెప్ట్.. బాలీవుడ్ లోనూ క్లిక్ అవడం ఖాయమనే అంచనాలున్నాయి. గతంలో మణిరత్నం చిత్రాలు సౌత్ కంటే ఎక్కువగా నార్త్ లో హిట్ అయిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు ఓకే కణ్మణి రీమేక్ కి కూడా ఇదే తరహాలో రెస్పాన్స్ వస్తుందని, ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.
Tags:    

Similar News