డిక్టేటర్‌ కు తమన్ సరిపోడంట

Update: 2015-12-13 06:00 GMT
పాటలు ఒకరితో చేయించుకుని.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంకొకరితో చేయించుకునే సంప్రదాయం ఈ మధ్య టాలీవుడ్లో బాగా కనిపిస్తోంది. ‘అఖిల్’ సినిమాకు అనూప్ రూబెన్స్, తమన్ పాటలు అందిస్తే.. మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. తాజాగా ‘బెంగాల్ టైగర్’ విషయంలోనూ అలాగే జరిగింది. భీమ్స్ పాటలకు వాయిస్తే.. చిన్నా నేపథ్య సంగీతం అందించాడు. బాలయ్య కొత్త సినిమా ‘డిక్టేటర్’ విషయంలోనూ ఇలాగే చేస్తున్నారట.

ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. పాటలు ఆల్రెడీ పూర్తి చేశాడు. ఐతే మాస్ సినిమాలకు తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సరిగా ఇవ్వలేడన్న విమర్శ ఉండటం.. బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషలిస్టుగా గుర్తింపు ఉన్న మణిశర్మకు ఆ బాధ్యత అప్పగిస్తున్నట్లు సమాచారం.  మణిశర్మ ఇలా గతంలో ఎన్నోసార్లు ఓన్లీ బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం పని చేశాడు. బాలయ్యతో ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన మణిశర్మ.. సమర సింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి సినిమాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. మాస్ ఆడియన్స్‌ పల్స్ బాగా తెలిసిన మణిశర్మ అయితే హీరోయిజం బాగా ఎలివేట్ అవుతుందన్న ఉద్దేశంతో శ్రీవాస్ కూడా ఆయనకే ఆర్.ఆర్. బాధ్యతలు అప్పగించాడట.
Tags:    

Similar News