ప‌వ‌న్ గురించి సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన మ‌ణిశ‌ర్మ‌!

Update: 2022-11-24 00:30 GMT
మ‌ణిశ‌ర్మ‌కు మోలోడీ బ్ర‌హ్మ అనే పేరున్న విష‌యం తెలిసిందే. రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన హ‌ర‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ `రాత్రి`తో సంగీత ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌యాణాన్ని ప్రారంభించారు. బావ‌గారు బాగున్నారా, గ‌ణేష్‌, చూడాల‌ని వుంది వంటి సినిమాల‌తో సంగీత దర్శ‌కుడిగా త‌న‌దైన మార్కుని క్రియేట్ చేసుకున్నారు. చిరు తో పాటు విక్ట‌రీ వెంక‌టేష్‌, కింగ్ నాగార్జున‌, నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు హాట్ ఫేవ‌రేట్ గా నిలిచారు.

త‌న‌దైన మార్కు మెలోడీల‌తో స్వ‌ర బ్ర‌హ్మ అనిపించుకున్నారు. అయితే చిరు తో పాటు విక్ట‌రీ వెంక‌టేష్‌, కింగ్ నాగార్జున‌, నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు మ‌ణిశ‌ర్మ అందించిన సంగీతం ఒకెత్తు.. 200ల లో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో చేసిన `ఖుషీ` ఆల్బ‌మ్ మ‌రో ఎత్తు. శ్రీ సూర్యా మూవీస్ బ్యాన‌ర్ పై త‌మిళ `ఖుషీ`కి రీమేక్ గా నిర్మించారు. ఈ మూవీతో త‌మిళ ద‌ర్శ‌కుడు ఎస్‌.జె. సూర్య తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఈ మూవీ కోసం మ‌ణిశ‌ర్మ స్వ‌ర ప‌రిచిన ప్ర‌తీ పాట ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచాయి.

ఎప్పుడు విన్నా ఈ సినిమాలోని సాంగ్స్ ఫ్రెష్ గా కొత్త‌గా వుంటాయి. అంతే కాకుండా ఈ మూవీ కోసం కొత్త ప్ర‌యోగం కూడా చేశారు. తెలుగు సినిమాల్లో కంప్లీట్ హిందీ సాంగ్ అనే ట్రెండ్ కి శ్రీ‌కారం చుట్టింది ఈ మూవీనే.

ఇందులో ప‌వ‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ గా వ‌చ్చే `ఏ మేరా జ‌హా.. ఏ మేరా ఆశియా...` అంటూ హిందీ ప‌దాల‌తో ఈ పాట సాగుతుంది. థియేట‌ర్ల‌లో ఈ పాట ఓ రేంజ్ లో మారు మోగిన విష‌యం తెలిసిందే. ఈ పాట వెన‌కున్న అస‌లు సీక్రెట్ ని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బ‌య‌ట‌పెట్టాడు మ‌ణిశ‌ర్మ‌.

ఇప్ప‌టికీ ప‌వ‌న్ ఫ్యాన్స్ హ‌మ్ చేసుకునే ఈ పాట ఐడియా త‌న‌ది కాద‌ని క్లారిటీ ఇచ్చాడు. ఎప్ప‌టి క‌ప్పుడు త‌న సినిమాల‌తో కొత్త త‌ర‌హా ప్రయోగాలు చేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ మూవీ కోసం కంప్లీట్ హిందీ సాంగ్ ని చేద్దామ‌న్నార‌ట‌. ఐడియా న‌చ్చ‌డంతో నిర్మాత ఏ.ఎం. ర‌త్నం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. పాట విన‌గానే ఇది ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ సాంగ్ అవుతుంద‌ని మ‌ణిశ‌ర్మ ముందే ఊహించార‌ట‌. త‌ను అనుకున్న‌ట్టే ఈ పాటు టాప్ లో ట్రెండ్ అయింద‌ని, ఆ క్రెడిట్ ప‌వ‌న్ దేన‌ని అస‌లు విష‌యం తాజాగా బ‌య‌ట‌పెట్ట‌డం విశేషం.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News