ఖుషీ.. పవన్ కళ్యాణ్ కెరియర్ ను కొత్త పుంతలు తొక్కించిన సినిమా అది. ఆ సినిమాతో పవన్ ఒక బిగ్ స్టార్ అయిపోయాడు. స్టయిల్ కింగ్ గా ఎదిగాడు. ఇక అదే సినిమాతో టాలీవుడ్ లో భూమిక ఫుల్ బిజీ అయిపోయింది. దర్శకుడు ఎస్.జె.సూర్య కూడా ఇక్కడ బాగా పాపులర్ అయిపోయాడు. అయితే ఆ సినిమా సక్సెస్ విషయంలో.. అత్యంత కీలక పాత్రను పోషించింది మాత్రం సినిమా పాటలే. మణిశర్మ అందించిన అమ్మాయే సన్నగా వంటి పాటలు యువతను పిచ్చోళ్ళను చేసేశాయి. వాటికితోడు పి.సి.శ్రీరాం అందించిన విజువల్స్ అద్భుతం. బాగానే ఉంది.
అయితే ఖుషీ సీక్వెల్ అనగానే.. ముందుగా అందరికీ మణి శర్మే గుర్తొచ్చాడు. ఖుషీ 2 సినిమాను తీస్తున్నారంటే.. వెంటనే అందరూ పవన్ కళ్యాణ్ ఎన్నాళ్ళగానో తాను నమ్మిన మణి శర్మకు మరోసారి అతి పెద్ద బ్రేక్ ఇస్తాడని ఆశించారు. కాని అనూహ్యంగా ఆ అవకాశాన్ని అనూప్ రూబెన్స్ తన్నుకుపోయాడు. గోపాల గోపాల సినిమాతో పవన్ ను ఇంప్రెస్ చేయడంతో.. అనూప్ ను పెట్టుకోండి అంటూ పవన్ డైరెక్టు ఆర్డర్ వేసేశాడట. కాని ఇలాంటి సీక్వెల్ సినిమాకు మణి శర్మకు బ్రేక్ ఇస్తే ఎలా ఉండేది? బాగుంటుంది అంటున్నారు మ్యూజిక్ లవర్స్.
సర్లేండి.. ఎవరికి ఏ సినిమాలు చేయాలని రాసిపెట్టుంటే అవి వస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు అనూప్ టార్గెట్ ఏంటంటే.. అప్పట్లో ఊర్రూతలూగించిన మణి శర్మ మ్యూజిక్ కు ధీటుగా మనోడు ఖుషీ 2 పాటలను కంపోజ్ చేసిచూపిస్తాడా? చూద్దాం.