కొందరు ఏం చేయాలనుకుంటే అది చేసేస్తారు! ఆ కేటగిరీకే చెందుతుంది కంగన రనౌత్. ఈ భామ తనని ప్రలోభాలకు గురి చేసిన, వంచించిన పరిశ్రమపై కసి తీర్చుకుంటోంది. ఎవరికీ చిక్కని అసాధారణ స్టార్‌డమ్‌ని దొరకబుచ్చుకుని తాను ఏ ఆట ఆడితే దానికి అవతలివాళ్లు తలొంచేలా చేస్తోంది. ఇదివరకూ రచయిత అపూర్వ అస్రానీతో గొడవ పెట్టుకుంది. అతడు రాసిన కథకు తానే రచయిత అని పేరు వేయించుకుని ఆ క్రెడిట్స్‌ని కొట్టేసింది. దీనిపై ఇప్పటికీ అతడు గొడవ పడుతూనే ఉన్నాడు. ఇక హృతిక్ రోషన్- రాకేష్ రోషన్ వింగ్‌తో గొడవలు వేరే కథ.
అదంతా అటుంచితే... తాజాగా `మణికర్ణిక` క్లాప్బోర్డ్పై తన పేరును వేయించుకుని మరోసారి వాడి వేడిగా చర్చల్లోకొచ్చింది. వాస్తవానికి ఈ చిత్రానికి కంగన స్క్రిప్టు విభాగంలో తనవంతుగా పని చేసింది. ఇదివరకూ రచయితగా ట్రైనింగ్ తీసుకుంది కాబట్టి, తన విజ్ఞానాన్ని ప్రదర్శించిందిట. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి `ఎన్టీఆర్` చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ క్రమంలోనే కంగనతో క్రిష్‌కి చెడిందని, దానివల్లనే అతడు మణికర్ణిక పెండింగ్ పనులు పూర్తి చేయకుండా వదిలేశాడని ప్రచారమవుతోంది. అందుకు రుజువు ఇదిగో ఇదే అన్న చందంగా కంగన ప్రవర్తన కనిపిస్తోంది.
క్రిష్ మీద అలకబూనిందా? లేక గొడవకు కాలు దువ్వుతోందో తెలీదు కానీ.. `కంగన దర్శకత్వం` అంటూ మణికర్ణిక క్లాప్ బోర్డ్‌పై ప్రింట్ చేయించింది. ఈ క్లాప్‌బోర్డ్ ఫోటో ప్రస్తుతం యువతరం సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతోంది. అయితే ఇదేం పని కంగన మ్యాడమ్? అని ప్రశ్నిస్తున్నవారికి తాను స్వయంగా జవాబివ్వకుండా తన తరపున ప్రతినిధి మాట్లాడుతుండడం సందేహాల్ని రాజేస్తోంది. క్రిష్ జాగర్లమూడినే ఈ చిత్రానికి దర్శకుడు! అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే, కంగన తన పేరు వేయించుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలింతకీ మణికర్ణిక విషయంలో ఏం జరుగుతోంది? అన్నదానిపై సరైన క్లారిటీ లేదు. ఇక 2019 జనవరి 25న మణికర్ణిక చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు తేదీని ఫిక్స్ చేసేసిన కంగన స్వీయదర్శకత్వంలోనే ప్యాచ్ వర్క్ షూటింగ్ చేసేస్తోందిట. వామ్మోవ్ కంగన!! నువ్వు అసాధ్యురాలివేనమ్మా!