తెలుగులో ప్రేక్షకాభిమానంతో పాటు గౌరవం కూడా సంపాదించిన దర్శకులు కొద్దిమందే. ఆ జాబితాలో జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ పేరు కచ్చితంగా చెప్పుకోవాలి. తొలి సినిమా ‘గమ్యం’తోనే తెలుగులో చాలా మంచి పేరు సంపాదించాడు క్రిష్. ఆ తర్వాత ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చిత్రాలతో తన స్థాయిని ఎంతో పెంచుకున్నాడు. ఫ్లాప్ అయిన ‘వేదం’.. ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలు సైతం క్రిష్ మీద గౌరవాన్ని పెంచాయే తప్ప తగ్గించలేదు. ఇలాంటి దర్శకుడికి బాలీవుడ్లో జరుగుతున్న అవమానం తెలుగువారికి వేదన కలిగిస్తోంది. ముందుగా క్రిష్ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ చేతికి ‘ఠాగూర్’ లాంటి కమర్షియల్ సినిమాను రీమేక్ చేసే బాధ్యత అప్పగించారు. అతను ఆ పనిని అన్యమనస్కంగా చేశాడేమో.. ‘గబ్బర్’ సరిగా ఆడలేదు. ఐతే బాలీవుడ్లో రెండో ప్రయత్నంగా వీర నారి ఝాన్సీ లక్ష్మీబాయి కథతో ‘మణికర్ణిక’ లాంటి మెగా సినిమా తీయడానికి రెడీ అవడంతో క్రిష్‌కు ఈసారి తనేంటో రుజువు చేసుకుంటాడని అంతా అనుకున్నారు.
కానీ ఈ చిత్రంలో క్రిష్ ప్రాధాన్యాన్ని తగ్గించేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. క్రిష్ పనితీరు విషయంలో హీరోయిన్ కంగనా రనౌత్.. నిర్మాతలు అసంతృప్తితో ఉన్నారని.. అతడి ప్రమేయం లేకుండా కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారని కొన్ని రోజుల కిందట వార్తలొస్తే అవి రూమర్లే అనుకున్నారు. కానీ అదే నిజమని అధికారికంగా రూఢి అయింది. కంగనా స్వయంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న విషయం వెల్లడైంది. కంగనా అండ్ టీమ్ ఈ విషయంలో ఉద్దేశపూర్వకంగా మీడియాకు లీకులివ్వడం క్రిష్ ను అవమానించడం కాక మరేంటి? అది చాలదన్నట్లు తాజాగా సోనూ సూద్ గొడవతో క్రిష్‌ను మరింతగా కించపరుస్తున్నారు. క్రిష్ డైరెక్షన్ లో సినిమాకు అవసరం లేని కుస్తీ సీన్లను సూద్ చేయించుకున్నాడని.. వాటిపై రచయితలు అభ్యంతరం చెప్పారని.. ఆ సీన్లను తొలగిస్తున్నామని కంగనా చెప్పడం చూస్తే ఈ సినిమాలో క్రిష్ పాత్రను ఎంత తగ్గించేశారో.. ఏ పరిస్థితుల్లో అతను ఈ ప్రాజెక్టును వదిలేసి ‘యన్.టి.ఆర్’ను మొదలెట్టాడో స్పష్టంగా అర్థమవుతోంది. అసలు ఈ సినిమా రిలీజైనపుడు దర్శకుడిగా క్రిష్ పేరు పడుతుందా లేదా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయిప్పుడు. క్రిష్ మీడియా ముందుకొస్తే మాత్రం దీనిపై ప్రశ్నల పరంపర ఖాయం. అప్పుడతను ఏం సమాధానాలు చెబుతాడన్నదీ ఆసక్తికరం.