కంగన టైటిల్ పాత్రలో నటిస్తున్న `మణికర్ణిక` గురించి ఏడాది కాలంగా ఆసక్తికర చర్చ సాగుతోంది. టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడంతో ఈ సినిమాపై ఇక్కడా ఉత్కంఠ నెలకొంది. అసలు మణికర్ణిక చిత్రం ఎలా ఉండబోతోంది? అని అంతా ఆసక్తిగా వేచి చూస్తున్నారు. గ్రేట్ వారియర్ క్వీన్ ఝాన్సీ లక్ష్మీ భాయ్ వీరత్వం ఎలా ఉండబోతోందో తెరపై చూడాలన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సినిమా ఆన్‌సెట్స్ ఉండగానే దర్శకుడు క్రిష్ తో కంగన గొడవ పడి తనే దర్శకత్వ విభాగాన్ని లాక్కోవడంపైనా ఆసక్తికర చర్చ సాగింది.
ఎన్నో ఊహించని ఘటనల తర్వాత మణికర్ణిక చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ కి తెస్తోంది కంగన. జీ స్టూడియోస్ పతాకంపై కమల్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదివరకూ రిలీజైన టీజర్ ఆకట్టుకుంది. తాజాగా మణికర్ణిక ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఆద్యంతం వారియర్ క్వీన్ వీరత్వం గురించి చూపించే ప్రయత్నం చేశారు. ఝాన్సీ రాణి ఒక బిడ్డ తల్లి అయ్యి ఉండీ రాజ్యం కోసం ప్రజల కోసం కదనరంగంలో ఎలాంటి పోరాటం చేసింది? అన్న ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
అయితే తాజాగా రిలీజైన ట్రైలర్ అంచనాల్ని అందుకోలేకపోయింది. వాస్తవానికి సినిమా ఆన్ లొకేషన్ ఉండగా సాగిన ప్రచారార్భాటంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. కానీ ఆశించినంత ఎమోషన్ .. వీరత్వాన్ని ఆవిష్కరించడంలో కంగన ఫెయిలైందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఝాన్సీ రాణి జీవితంలో ఎమోషన్ ని పూర్తి స్థాయిలో తెరపైకి తేగలిగిందా లేదా? అన్నది కేవలం ఈ ట్రైలర్ చూసి చెప్పలేం. కేవలం వారియర్ క్వీన్ గా గుర్రపు స్వారీ.. కత్తి తిప్పడం వంటి విద్యల్లో ఎంతో ప్రాక్టీస్ చేసినట్టుగా కనిపించినా.. ఝాన్సీ రాణి కథలో అసలైన ఎమోషన్‌ని ఎంతవరకూ అందంగా చూపించారన్నదానిని బట్టే సినిమా గట్టెక్కుతుంది. ఈనెల 21న సినిమా రిలీజ్ కి వస్తోంది. హిందీ - తెలుగులోనూ రిలీజ్ కానుంది ఈ చిత్రం. ట్రైలర్ సోసోనే కాబట్టి.. కనీసం సినిమాలో కంటెంట్ అయినా నడిపిస్తుందేమో చూడాలి.
Full View