హీరో ఫ్యాన్స్ ని నిలదీసిన దర్శకుడు

Update: 2019-06-17 07:22 GMT
గత రెండు మూడేళ్లుగా సరైన సక్సెస్ లేక వెయిటింగ్ లో ఉన్న కింగ్ నాగార్జున కొత్త సినిమా మన్మథుడు 2 రకరకాల కారణాల వల్ల అటు పాజిటివ్ గానూ ఇటు నెగటివ్ గానూ వార్తల్లో నిలుస్తోంది. నాగ్ గ్లామర్ ని ఫుల్ గా వాడుకుంటూ అరవై ఏళ్ళ వయసులోనూ ఇంత అందంగా స్క్రీన్ మీద చూపించడం పట్ల టీజర్ చూసాక బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ వయసులో అలాంటి బోల్డ్ సీన్స్ అవసరమా అంటూ కొందరు డైలాగ్స్ లో డబుల్ మీనింగ్ ఉన్నాయని కొందరు ఇలా సోషల్ మీడియాలో ఫీడ్ బ్యాక్ ఇంకో రకంగానూ వచ్చింది.

ఇది చాలదు అన్నట్టు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ భార్య డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తన భర్త సినిమాను పొగడడం ఇంకో ఇరకాటం తెచ్చి పెట్టింది. గతంలో ఈవిడే ఏజ్ బార్ హీరోలు ఇంకెన్నాళ్లు కూతురి వయసున్న హీరోయిన్ల రొమాన్స్ చేస్తారని పోస్ట్ పెట్టింది. ఇది చాలా కాలం కింది ముచ్చట. అయితేనేం ట్రాలింగ్ కి టాపిక్ దొరికిపోయింది

ఇదిలా ఉండగా మన్మథుడు టైటిల్ ని వాడటం పట్ల కొందరు అక్కినేని ఫ్యాన్స్ ట్విట్టర్ లో రాహుల్ రవీంద్రన్ ను గట్టిగానే నిలదీశారు. వేరే పేరే దొరకనట్టు క్లాసిక్ జోలికి ఎందుకు వెళ్లారని అడిగారు. దీంతో రాహుల్ రవీంద్రన్ ఎంత చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కొందరు ఓవర్ యాక్షన్ చేయడంతో చివరికి చిన్న క్లాసు పీకాల్సి వచ్చింది. నేనేదో ఆస్తులు తీసుకుంటున్నట్టు ఎందుకలా ఫీలవుతున్నారో అర్థం కావడం లేదని ఇంత ద్వేషం తగదని ట్వీట్ చేశాడు. మొత్తానికి అన్ని రకాలుగా మన్మథుడు 2 టాపిక్ చర్చల్లో నిలుస్తోంది. ఆగస్ట్ 9 డేట్ లాక్ చేసుకున్న మన్మథుడు 2 మీద అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి


Tags:    

Similar News