టాలీవుడ్ లో కొంత మంది చిన్న తరహా నిర్మాతలు ఆలోచిస్తున్న తీరు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే మంచి హిట్స్ అందుకుంటూ ముందుకు వెళుతున్నారు. అదేదో కమర్షియల్ హిట్స్ అందుకుంటే పొరపాటే. ఊహించని కథలను చెప్పే దర్శకులకు మంచి అవకాశం ఇచ్చి మీడియం బడ్జెట్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఆ సినిమాలు లాభాలను కూడా ఊహించని విధంగా అందిస్తున్నాయి. గతంలో ఎక్కువగా ఈ తరహాలో హిట్స్ అందుకున్న నిర్మాతల జోడి.. రవి ప్రకాష్ - కళ్యాణ్ రామ్.
2007 లో వచ్చిన మంత్ర సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఛార్మి - శివాజి ప్రధాన పాత్రలో వచ్చిన ఆ హారర్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు దక్కింది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. బేసిక్ గా ఈ సినిమా నిర్మాతలు ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్స్ గా వర్క్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ జిగేల్ అనే మరో సినిమాతో రానున్నారు. కొంచెం మంత్ర థ్రిల్లింగ్ తరహాలో ఉండే ఈ కథపై చాలా నమ్మకంగా ఉన్నారట. గత ఏడాది గరుడవేగ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించిన అదిత్ అరుణ్ కథానాయికుడిగా సెలెక్ట్ అయ్యారు.
మల్లికార్జున్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. పెద్దగా తారాగణం కాకుండా సినిమాకు తగ్గట్టుగా చిన్న తరహాలో నటీనటులను ఫిక్స్ చేయనున్నారు. బడ్జెట్ కూడా కొంచెం హీరో మార్కెట్ ను పట్టించుకోకుండా కథను నమ్మి గట్టిగా పెడుతున్నారట. మరి ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.