మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన మరక్కార్ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించారు. మొదట ఈ సినిమా ను థియేటర్ రిలీజ్ చేయాలని భావించారు. సినిమా చిత్రీకరణ ముగింపు సమయంలో కరోనా ఎటాక్ అవ్వడంతో థియేటర్ రిలీజ్ సాధ్యం కాలేదు. ఓటీటీ కి సినిమాను ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత థియేటర్ రిలీజ్ కు మళ్లీ ప్రయత్నించారు. చివరకు అమెజాన్ వారికి ఈ సినిమాను ఇచ్చేయనున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. అమెజాన్ వారు మరక్కార్ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించిన నేపథ్యంలో మోహన్ లాల్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. దాంతో కేరళ మంత్రి స్పందించి మరక్కార్ సినిమా థియేటర్ రిలీజ్ చేసేందుకు సహకరిస్తామంటూ హామీ ఇవ్వడంతో నిర్మాతలు థియేటర్ రిలీజ్ మరియు ఓటీటీ స్ట్రీమింగ్ కు ఓకే చెప్పడం జరిగింది.
నేడు దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేడు మోహన్ లాల్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు ఏ సినిమాకు దక్కని అరుదైన రికార్డు మరక్కార్ సినిమాకు దక్కింది అంటూ వారు ఆ పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం ఎంత అనేది తెలియదు కాని ఆ పోస్టర్ అనుసారంగా కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మరక్కార్ సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను దక్కించుకుందట. కేవలం అడ్వాన్స్ బుకింగ్ తో వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ సినిమా ఒక్కటి అంటే ఒక్కటి కూడా లేదు. అది కేవలం మోహన్ లాల్ సినిమానే అంటే ఆయన అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు.
సాదారణంగా సినిమా వసూళ్లను భారీగా ప్రకటించడం తెలుగు నిర్మాతలకు అలవాటు. ఈమద్య కాలంలో తమిళ హీరోల అభిమానులు మరియు నిర్మాతలు కూడా ప్రకటించారు. ఇప్పుడు మేమన్నా తక్కువా అన్నట్లుగా మలయాళం ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఈ విషయాన్ని ప్రకటించడం చర్చ నీయాంశంగా మారింది. అయినా విడుదల అయిన మొదటి రోజు లేదా రెండు రోజుల్లో వంద కోట్లు అంటే పర్వాలేదు కాని మరీ విడుదల కాకుండానే అడ్వాన్స్ బుకింగ్ లతోనే వంద కోట్ల వసూళ్లు అంటూ ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నిర్మాతలు ఇటీవల తాము వసూళ్లను భారీగా పెంచి ప్రచారం చేస్తాము.. పబ్లిసిటీ కోసం తప్పదు అన్నట్లుగా వారు నిజంను ఒప్పుకున్నారు. కనుక మరక్కార్ వసూళ్లు నిజం అయినా కూడా నమ్మాలనిపించడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.