లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ మధ్య బయటెక్కడా కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటోందని అంటున్నారు. ఆ మధ్య కీరవాణి కూడా సిరివెన్నెల అనారోగ్యం గురించి ప్రస్తావించాడు. ఈ మధ్య ఆయనకు వైరల్ ఫీవర్ వచ్చి ఇబ్బంది పడుతున్నారట. అలాంటి టైంలోనూ ‘మహానుభావుడు’ సినిమా చూసి తనకు ఫోన్ చేసి అభినందించారని అంటున్నాడు దర్శకుడు దాసరి మారుతి.
‘మహానుభావుడు’ సక్సెస్ మీట్లో మారుతి ఈ విషయాన్ని వెల్లడించాడు. సిరివెన్నెల తనకు ఫోన్ చేసి ‘మహానుభావుడు’ చాలా బాగుందని.. చాలా బాగా తీశావని అభినందించారని మారుతి తెలిపాడు. ఆయన ఈ వేడుకకు కూడా వచ్చి ‘మహానుభావుడు’ గురించి మాట్లాడాలనుకున్నారని.. ఐతే వరల్ ఫీవర్ కారణంగా రాలేకపోయారని మారుతి వెల్లడించాడు.
‘మహానుభావుడు’ తన కెరీర్లో మరిచిపోలేని సినిమా అని.. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయాన్నందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నాడు మారుతి. నటీనటులు.. టెక్నీషియన్లు తమ పని తీరుతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారని అతనన్నాడు. ఈ సినిమా చూడని వాళ్లు తప్పకుండా చూడాలని.. చూసిన వాళ్లు మళ్లీ మళ్లీ చూడాలని మారుతి కోరాడు. ఇకపైనా తాను ‘మహానుభావుడు’ లాంటి మంచి సినిమాలే చేస్తానని చెప్పాడు.