బన్నీ వాసు.. మారుతి.. వీళ్లిద్దరూ కూడా అల్లు అర్జున్ స్నేహం సంపాదించడం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వాళ్లే. ఇద్దరూ మొదట్లో ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత కష్టపడి నిలదొక్కుకున్నారు. దర్శకుడిగా మారుతి తొలి సినిమా ‘ఈ రోజుల్లో’లో బన్నీ వాసు హ్యాండ్ కూడా ఉంది. ఈ చిత్ర విడుదల కోసం అతను కూడా చాలానే శ్రమించాడు. ఐతే ఈ సినిమా ప్రివ్యూ చూసినపుడు మాత్రం బన్నీ వాసు పెదవి విరిచాడట. ఈ సినిమా ఏంటి ఇలా ఉంది.. ఇది వర్కవుట్ కాదు అనేశాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మారుతి స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘ఈ రోజుల్లో’ సినిమా మీద తమ టీంలో ఎవరికీ ముందు అంత కాన్ఫిడెన్స్ లేదని అతను చెప్పాడు. అలాంటి సమయంలో ప్రివ్యూ చూసి బన్నీ వాసు కూడా నిరాశ వ్యక్తం చేయడంతో సినిమా ఆడదనే అనుకున్నట్లు మారుతి తెలిపాడు.
ప్రివ్యూ చూసిన అనంతరం బన్నీ వాసు దాన్ని ఎడిట్ చేసి మరో రకంగా మార్చడానికి సిద్ధమయ్యాడని.. ఐతే తాను మాత్రం అలా ఏమీ చేయొద్దని.. ఉన్నదున్నట్లుగా రిలీజ్ చేద్దామని అన్నానని మారుతి తెలిపాడు. అప్పటికి బన్నీ వాసు కొంచెం పెద్ద స్థాయిలో సినిమాలు చేస్తున్నారని.. తాను ఇంటర్మీడియట్ కుర్రాళ్ల మనస్తత్వాల నేపథ్యంలో వాళ్ల అభిరుచికి తగ్గట్లుగా సినిమా తీశానని.. దీంతో బన్నీ వాసుకు సినిమా నచ్చలేదని మారుతి అన్నాడు. ఐతే ట్రైలర్ లాంచ్ చేశాక బయ్యర్లలో.. బయటి జనాల్లో ఆసక్తి పుట్టిందని.. హక్కుల కోసం ఒక్కొక్కరుగా రావడం మొదలుపెట్టారని.. దీంతో బన్నీ వాసు ఎవరు ఎంతకు అడిగితే అంతకు సినిమాను అమ్మేసి వదిలించుకో అన్నాడని మారుతి గుర్తు చేసుకున్నాడు. ఒక వ్యక్తి రీమేక్ హక్కుల్ని అన్ని భాషలకూ కలిపి రూ.2 లక్షలకు అడిగితే.. ఆ మొత్తానికే ఇచ్చేయడానికి సిద్ధపడిపోయామని.. అతను పది వేలు అడ్వాన్స్ ఇస్తే దాన్ని కూడా తీసుకున్నామని.. మిగతా ఏరియాల హక్కుల్ని కూడా అడిగినంతకు ఇచ్చేశామని.. అయినప్పటికీ తాము టేబుల్ ప్రాఫిట్ తీసుకున్నామని మారుతి వెల్లడించాడు. ఈ సినిమా ఆడదని అనుకున్నాం కానీ.. తమ అంచనాల్ని తలకిందులు చేస్తూ పెద్ద విజయం సాధించిందని అతను చెప్పాడు.