కెరీర్లో చెప్పుకో దగ్గ విజయాలు ఉన్నప్పటికీ స్టార్ హీరోలను దర్శకత్వం వహించే అవకాశం మాత్రం డైరెక్టర్ మారుతి కి ఇంకా రాలేదు. చాలా కాలంగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ మారుతి మీడియమ్ రేంజ్ హీరోలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే' ఈమధ్యే రిలీజ్ అయింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనిపించుకుంది కానీ దర్శకుడిగా మారుతికి పెద్దగా క్రెడిట్ దక్కలేదు. దీంతో మారుతి కెరీర్ కు పెద్దగా ఉపయోగం లేనట్టే. ముఖ్యం గా నెక్స్ట్ లీగ్ కు వెళ్ళే అవకాశం ఇప్పట్లో దాదాపు గా లేనట్టే.
సినిమాకు కలెక్షన్స్ బాగానే ఉన్న ఫిలిం మేకింగ్ పరంగా మారుతి పాస్ మార్కులు మాత్రమే తెచ్చుకున్నాడనే అభిప్రాయం వినిపిస్తోంది. కథ చూస్తే 'శతమానం భవతి'ని అటూ ఇటూ మార్చి తీసిందే కానీ కొత్తదనం లేదని అంటున్నారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ వీక్ గానే ఉందనేది చాలామంది వ్యక్తం చేస్తున్న మరో అభిప్రాయం. ఈ సినిమా కు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన పోటీ లేకపోవడం కూడా కలిసి వచ్చింది. సాయి తేజ్ లాంటి సెకండ్ లీగ్ హీరోలకు ఇలాంటి కథలు వర్క్ అవుట్ అవుతాయేమో కానీ పెద్ద స్టార్ల కు ఇలాంటి కథలు కష్టమే. ఇక మారుతి ఈమధ్య దర్శకత్వం వహించిన ఇతర సినిమాల ను చూస్తే అవి కూడా అంతంత మాత్రమే.
మారుతి ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఈమధ్య బ్లాక్ బస్టర్ సినిమా లేవీ లేవు. మీడియం రేంజ్ హీరోల కు భారీ హిట్లు ఇస్తేనే స్టార్ హీరోల దృష్టి మారుతి పై పడుతుంది. అప్పుడు స్టార్ హీరోల కోసం బలమైన కమర్షియల్ కథలు రెడీ చేస్తేనే అవకాశాలు దక్కుతాయి. లేకపోతే ఇలా మీడియం రేంజ్ సినిమాల తో సరి పెట్టుకోక తప్పదు. మరి మారుతి తన రూట్ మార్చుకుంటారా.. స్టార్ హీరోల తో సినిమా చేసే అవకాశాలు సాధిస్తారా అనేది వేచి చూడాలి.