తెలుగులో ‘మాస్టర్’ హవా.. క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్.. ప్రాఫిట్ మామూలుగా లేదుగా..!
కోలీవుడ్ స్టార్ హీరోల్లో చాలా మందికి తెలుగులో క్రేజ్ ఉంది. అయితే.. దళపతి విజయ్ కి మాత్రం తెలుగులో మార్కెట్ ను పెంచుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ క్రమంలో సంక్రాంతికి రిలీజైన ‘మాస్టర్’ మూవీ.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. టాక్ సంగతి ఎలా ఉన్నా.. తెలుగులోనూ సినిమా మాంచి లాభాలనే తెచ్చిపెట్టింది.
లాక్ డౌన్ తరువాత విడుదలైన అతిపెద్ద సినిమా కావడంతో.. అందరిచూపు బాక్సాఫీస్ కలెక్షన్స్ పైనే పడింది. థియేటర్స్ లో 100% సీటింగ్ కెపాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరగా.. మొదట్లో పర్మిషన్ వచ్చింది కూడా. ఆ తర్వాత విమర్శలు తలెత్తడంతో ఆ నిర్ణయం వెనక్కి వెళ్లింది. దీంతో.. 50% ఆక్యుపెన్సీతోనే సినిమా రిలీజైంది. ఈ నేపత్యంలో.. కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనే ఆందోళన వ్యక్తమైంది. కానీ.. అందరి సందేహాలను పటాపంచలు చేస్తూ.. ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించింది.
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ ప్రకారం.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా.. మొదటి వీకెండ్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. కేవలం 50% ఆక్యుపెన్సీతోనే విడుదలై.. ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందంటే పెద్ద వండర్ అనే అంటున్నారు.
ప్రస్తుతం మాస్టర్ సినిమా.. ఓటీటీ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. దాదాపు అన్ని ఏరియాల్లో క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఈ లెక్క ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రం రూ.8.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్లలో విడుదలైంది. కానీ.. సాధించిన టోటల్ షేర్ 14.60కోట్లు! ఈ లెక్కన రూ.6కోట్ల వరకు బయ్యర్ కు లాభాలను ఆర్జించి పెట్టింది మాస్టర్. మొత్తానికి.. ఈ సినిమా ద్వారా దళపతి తెలుగులో బలమైన మార్కెట్ సెట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. మరి, రాబోయే చిత్రాల ద్వారా విజయ్ మార్కెట్ ఏ రేంజ్ కు చేరుకుంటుందో చూడాలి.