కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ప్రస్తుతం విజయ్ సేతుపతి హవా కొనసాగుతోంది. తమిళంలో వరుసగా హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా విలన్ గా సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి ఇటీవల తమిళం మాస్టర్ లో చేసిన విలన్ పాత్ర.. తెలుగు ఉప్పెనలో చేసిన పాత్రతో మొత్తం సౌత్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాడు. త్వరలో సేతుపతి బాలీవుడ్ సినిమ ను కూడా చేయబోతున్నాడు. ఈ సమయంలో విజయే సేతుపతికి పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు అవుతున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ సేతుపతి టాలీవుడ్ హీరో రవితేజకు అభిమానిగా మారబోతున్నాడు. నిజంగా కాదులేండి ఒక సినిమా కోసం రవితేజ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ 'డ్రైవింగ్ లైసెన్స్' ను రవితేజ మరియు విజయ్ సేతుపతిలు రీమేక్ చేయబోతున్నారు. ఒక స్టార్ హీరోకు మరియు ఆర్టీఓ ఇన్స్ పెక్టర్ కు మద్య జరిగే కథతో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా నడుస్తుంది. ఆ స్టార్ హీరోకు వీరాభిమాని ఆర్టీఓ ఇన్స్ పెక్టర్. ఒక అభిమాని కడుపు మండితే ఎలా ఉంటుంది.. ఆ హీరోను ఎలా దారికి తీసుకు వస్తాడు అనేది సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించారు.
ఆర్టీఓ ఇన్స్ పెక్టర్ గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడని.. స్టార్ హీరో పాత్రను రవితేజ చేయబోతున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కొన్ని నెలల క్రితం ఈ సినిమా రీమేక్ రైట్స్ ను రామ్ చరణ్ దక్కించుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. మరి వీరితో చరణ్ ఈ రీమేక్ ను నిర్మించబోతున్నాడా లేదంటే మరెవ్వరికైనా ఈ రీమేక్ రైట్స్ ను అప్పగించాడా అనేది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. తెలుగు డ్రైవింగ్ లైసెన్స్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.