తెలుగు బ్రాహ్మిన్ గా పాకిస్తానీ బ్యూటీ

Update: 2016-02-04 04:04 GMT
బాలీవుడ్ లో చాలామంది పాకిస్తాన్ నటులు పాదం మోపారు, అదృష్టం పరీక్షించుకున్నారు. ఫవాద్ ఖాన్ - హుమైమా మాలిక్ - వీణా మాలిక్ - అలీ జాఫర్ లు ఇప్పటికే హిందీ సినిమాల్లో సత్తా చాటుతున్నారు. ఇప్పుడు వీరికి మరో భామ మావ్రా హొకేన్ తోడు వస్తోంది. సనమ్ తేరీ కసమ్ చిత్రంతో మవ్రా బాలీవుడ్ అడుగు పెడుతోంది. ఫిబ్రవరి 5న విడుదల కానున్న ఈ మూవీలో హర్షవర్ధన్ రాణేతో రొమాన్స్ చేసింది మావ్రా హొకేన్.

- మీ యాక్టింగ్ కెరీర్ గురించి..
పాకిస్తాన్ లో నేను చాలా నాటకాల్లోను, టీవీ షోలలోను నటించాను. సనమ్ తేరీ కసమ్ నాకు మొదటి సినిమా. అందుకే నా మనసుకు బాగా దగ్గరైంది.

- మీకు ఇష్టమైన ప్లేస్..
నేను కరాచీలో పుట్టాను, ఆ తర్వాత ఇస్లామాబాద్ కి మారారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. నేను వృత్తి రీత్యా అమెరికా - టర్కీ - దక్షిణాఫ్రికాల్లో ఉన్నాను, ఇప్పుడు ఇండియా వచ్చాను.. నాకు అన్ని ప్రాంతాలు ఇష్టమే.

- సనమ్ తేరీ కసమ్ లో ఆఫర్ ఎలా..
ఈ సినిమా కోసం నాకు ఆడిషన్ కూడా జరగలేదు. డైరెక్టర్ రాధికా రావుతో కలిసి అప్పటికే అహిష్టా అహిష్టాతో సహా కొన్ని టీవీ సీరియల్స్ లో పని చేశాను. మొదట ఓసారి ఓ మాట చెప్పారంతే. మళ్లీ చివర్లో నిన్ను సెలక్ట్ చేసుకున్నామని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.

-ఇందులో మీ పాత్ర గురించి..
ముంబైలో సెటిల్ అయిన తెలుగు బ్రాహ్మణ అమ్మాయి పాత్ర పోషిస్తున్నాను, మేనరిజమ్స్ విషయంలో నాకు ఇబ్బంది లేదు. చేసే పాత్రను నిజాయితీగా చేస్తే ఏ కేరక్టర్ అయినా పోషించచ్చు.

- నేను యాక్టర్ కాదు, పెర్ఫామర్ అంటూ ఉంటారు, ఎందుకలా
నాకు యాక్టింగ్ చేయడం తెలీదు, ఓ సారి స్క్రిప్ట్ చదివాక ఆ కేరక్టర్ ని స్టడీ చేసుకుంటాను. నన్ను నేను ఆపాత్రలోకి మార్చుకుంటాను, అందుకే అలా చెబుతుంటాను

- మీకు నచ్చే మాట
మా అమ్మ నా పేరుకు 'అసాధారణ'(ఔట్ స్టాండింగ్) అని అర్ధం చెప్పింది. అప్పటి నుంచి ఆ పేరును నిలబెట్టుకునేలా బతకాలని అనుకున్నాను.
Tags:    

Similar News