సినిమా మొదలు కాకముందే మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తి చేస్తే చాలా వరకూ పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. దర్శకుడికి అలానే సంగీత దర్శకుడికి మధ్య సింక్ అయ్యి మంచి ట్యూన్స్ కుదిరాయంటే అదే సినిమాకి కొండంత బలం. సగం విజయానికి సంగీతం దోహదపడుతుంది. అటుపై సెట్స్ లో పనికి కావాల్సినంత ఎనర్జీ దొరుకుతుంది.
ప్రస్తుతం సర్కారు వారి పాట (MB 27) సెట్స్ కి వెళ్లక ముందే ఈ విషయంలో పక్కా క్లారిటీగా ఉండాలని సంగీత దర్శకుడిని మహేష్ ఆదేశించారట. పరశురామ్ - థమన్ బృందం దీనిపై సీరియస్ గా కసరత్తు చేస్తున్నారని సమాచారం. కోవిడ్ 19 పరిస్థితి ఎలా ఉన్నా.. ఇకపై షూటింగ్ ని ప్రారంభించేందుకు హీరోలు మైండ్ సెట్ చేసుకునేందుకు ప్రిపేర్డ్ గా ఉన్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీ-ప్రొడక్షన్ పనులు సాఫీగా పూర్తి చేసి జనవరిలో మహేష్ బృందం సెట్స్ కెళ్లే వీలుందని తెలుస్తోంది.
షూటింగ్ ప్రారంభించే ముందు ఆల్బమ్ ను సిద్ధం చేయాలని పరశురామ్ ను మహేష్ కోరారు. దీనివల్ల తదుపరి విషయాల్లో యూనిట్ బాగా ప్లాన్ చేయడానికి సహాయపడుతుంది. ఎస్.ఎస్. థమన్ సినిమాలోని ఇతర అంశాల పై దృష్టి పెట్టగలగటం వలన అతనిపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. రీరికార్డింగ్ - బీజీఎంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టేందుకు చాలా సమయం ఉంటుంది. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.