అవును.. షెడ్ నిర్మాణం స్టార్ట్ అయిపోయింది. అయితే.. ఇది సినిమా టైగర్ కోసం. అదేనండీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం.. మెకానిక్ షెడ్ కన్ స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 13న నాన్నకు ప్రేమతో చిత్రాన్ని రిలీజ్ చేయనున్న ఎన్టీఆర్.. ఏమాత్రం గ్యాప్ లేకుండా తన నెక్ట్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేయనున్నాడు. నాన్నకు ప్రేమతో ప్రమోషన్స్ కోసం వారం పది రోజులు మాత్రమే కేటాయించి.. వెంటనే కొరటాల శివతో చేయనున్న చిత్రం సెట్స్ పైకి వెళ్లిపోనున్నాడు.
జనతా గ్యారేజ్ అనే వర్కింగ్ టైటిల్ పై నిర్మాణం కానుంది ఈ చిత్రం. రీసెంట్ గా ఈ మూవీ కోసం.. హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో పూజ చేశారు. ఆల్రెడీ నవంబర్ లోనే ప్రారంభోత్సవ పూజ జరుపుకున్నాక.. మళ్లీ పూజ ఎందుకనే ప్రశ్న సహజమే. అయితే.. ఇది ఓ భారీ షెడ్ నిర్మాణం ప్రారంభానికి సంబంధించిన కార్యక్రమం. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని, దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఇందుకోసం 2 వారాలకు పైగా సమయం పట్టనుందని తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.
ఇక డైరెక్టర్ కొరటాల శివ కూడా హ్యాట్రిక్ హిట్ పై కన్నేశాడు శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత కొరటాల నుంచి రానున్న మూవీ కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరోవైపు.. ఈ జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన సమంత - నిత్యామీనన్ లు హీరోయిన్ లుగా నటించే అవకాశం ఉంది.