లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజులు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలలయింది. మరో రెండు నెలలు థియేటర్లు రీ ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ థియేటర్లు ఓపెన్ అయినా ప్రేక్షకులు వస్తారో రారో తెలియదు. దీంతో ఓటీటీలకు 'నో అంటే నో' అని చెప్పిన ఫిలిం మేకర్లు నెమ్మదిగా తమ అభిప్రాయాలు మార్చుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది.
నిజానికి పెద్ద సినిమాలకు భారీ పాపులారిటీ ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్ లు అయిన అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్.. జీ5.. సన్ నెక్స్ట్ వారి నుంచి క్రేజీ డీల్స్ వస్తున్నాయట. అయితే ఈ సినిమాల హీరో హీరోయిన్లు ఓటీటీ రిలీజ్ కు అనుకూలంగా లేరు. కొందరు నిర్మాతల మాత్రం నెలల తరబడి ఆగితే వడ్డీల భారంపెరుగుతుందని.. తర్వాత అయినా పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయలేకుండా ఉన్నామని ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నారట. అయితే ఇప్పటివరకూ పెద్ద సినిమాల విడుదల విషయంలో నిర్ణయం మాత్రం తీసుకోలేదు.
అయితే చిన్న సినిమాల మేకర్లు మాత్రం ఆరునెలలు.. ఏడాది పాటు వేచి చూస్తే వడ్డీల భారం ఎక్కువ అవుతుందని.. థియేటర్లు ఓపెన్ అయినప్పటికీ పెద్ద సినిమాలకు మొదటి ప్రాధాన్యత దక్కుతుంది కాబట్టి వేచి చూడడం అనవసరం అనే అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పటికే 'అమృతారామమ్' అనే సినిమా Zee5 లో డైరెక్ట్ రిలీజ్ అయింది. ఇదే బాటలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం.
'కృష్ణ అండ్ హిజ్ లీల' త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రానుందట. ఈ సినిమాకు క్షణం ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకుడు. రానా దగ్గుబాటి ఈ సినిమాకు సమర్పకుడు. ప్రోమోలతో ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. ఇది కాకుండా జేడీ చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన 'MMOF' కూడా ఓటీటీ రిలీజ్ కు సిద్ధం అవుతోందని సమాచారం.
నిజానికి కొత్త విషయాలనును అందిపుచ్చుకోవడంలో చాలామంది భయపడతారు. మూడునాలుగు సినిమాలు కనుక ఇలా రిలీజైతే.. వాటిలో ఒకటి కనుక సూపర్ హిట్ అనే టాక్ తెచ్చుకుంటే మిగతా వారు కూడా తప్పని సరిగా ఈ కొత్త మాధ్యమానికి జై కొడతారు. నిజానికి థియేటర్ల విషయం అర్థమైన ప్రజలు ఇప్పటికే ఒటీటీ సబ్ స్క్రిప్షన్లు తీసుకోవడంలో తెగ బిజీగా ఉన్నారు.. ఇక చిన్న నిర్మాతలదే ఆలస్యం అన్నట్టుంది పరిస్థితి.