పవన్ కళ్యాణ్ నటించిన 'బంగారం' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మీరాచోప్రా.. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా ఫేమస్ అయింది. ఇటీవల నిబంధనలను అతిక్రమించి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారన్న ఆరోపణలతో మరోసారి వార్తల్లో నిలిచారు మీరా చోప్రా. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మీరా.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని చెబుతూ ఇన్స్ట్రాగ్రామ్ లో ఓ ఫొటోను షేర్ చేసింది. అయితే ఆమె ఫ్రంట్ లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఆమె పై ఆరోపణలు వచ్చాయి.
థానేలోని ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్‌వైజర్ గా పనిచేస్తున్నట్టు ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఫ్రంట్ లైన్ వర్కర్ క్యాటగిరీలో మీరాచోప్రా టీకా వేయించుకున్నట్టు బీజేపీ ఆరోపించింది. ఇది ముమ్మాటికీ రూల్స్ ను ఉల్లంఘించటమే అని.. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై థానే మున్సిపల్ కార్పొరేషన్(టీఎంసీ) దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై 3 రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించిన కమిషనర్.. ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదిలావుండగా కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తన పై వస్తున్న ఆరోపణలపై స్పందించిన మీరా చోప్రా.. ఆ వార్తలను ఖండించారు. అందరి లాగే నెల రోజులుగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నానని.. చివరకు తెలిసిన వాళ్ళ సహాయంతో వ్యాక్సినేషన్ సెంటర్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం తాను కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే ఇచ్చానని.. అంతకుమించి ఏ ఐడీ కార్డ్ ఇవ్వలేదని పేర్కొంది. వివాదానికి కారణమైన ఫేక్ ఐడీ తో తనకు సంబంధం లేదని.. ఎవరో ఫొటో షాప్ చేసారని ఆమె చెప్పింది. అలాంటి ఐడి తయారు చేయబడితే ఎలా చేశారు.. ఎందుకు చేసారనేది తెలుసుకోవాలనుకుంటున్నాను అని మీరా చోప్రా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.