అమలాపురం To హైదరాబాద్‌.. మెగా అభిమానం

Update: 2021-10-27 04:30 GMT
మెగా స్టార్ చిరంజీవికి కోట్లల్లో అభిమానులు ఉంటారు అనడంలో సందేహం లేదు. దేశ వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉంటారు. చాలా మంది తమ అభిమానంను చాటుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొద్ది మంది తమకు తోచిన సాయంను చిరంజీవి పేరుతో చేస్తూ ఉండగా.. మరి కొందరు మరో రకంగా తమ అభిమానంను చాటుకుంటూ ఉంటారు. ఇలా డెక్కల గంగాధర్‌ కూడా తన అభిమానంను చాలా విభిన్నమైన రీతిలో చాటుకున్నాడు. అమలాపురంకు చెందిన గంగాధర్‌ అక్టోబర్ 3న మెగాస్టార్‌ చిరంజీవిని కలిసేందుకు కాలి నడకన హైదరాబాద్ ప్రయాణం మొదలు పెట్టాడు.

మెగాస్టార్ అంటే తనకు ఉన్న అభిమానంను చూపించుకుంటూ గంగాధర్‌ కాలి నడకన చిరంజీవి ప్లెక్సీ పట్టుకుని నడక ప్రారంభించాడు. అక్టోబర్ 3న నడక ప్రారంభించిన గంగాధర్‌ ఎట్టకేలకు నిన్న చిరంజీవి బ్లడ్‌ అండ్ ఐ బ్యాంక్‌ కు చేరుకున్నాడు. అక్కడి వారు చిరంజీవికి ఈ విషయాన్ని తెలియజేయడంతో అతడిని ఇంటికి పిలిపించుకున్నాడు. అక్కడ నుండి చిరంజీవి ఇంటికి గంగాధర్‌ ను మెగా సన్నిహితులు తీసుకు వెళ్లారు. కొద్ది సమయం చిరంజీవితో  గంగాధర్‌ మాట్లాడే అవకాశం దక్కింది. తన జర్నీ ఎలా సాగింది అనే విషయాన్ని గంగాధర్‌ తెలియజేశాడు. గంగాధర్‌ తో కొద్ది సమయం మాట్లాడిన చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దంటూ సున్నితంగా హెచ్చరించాడు.

ఈమద్య కాలంలో అభిమానులు తమ అభిమానంను చూపించుకోవడంకు ఇలా పాద యాత్రలు చేయడం జరుగుతుంది. కాని ఇది ఏమాత్రం కరెక్ట్‌ కాదని.. వారి కుటుంబాల గురించి కూడా ఆలోచించాలంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉండవచ్చు కాని అది మరోరకంగా చూపిస్తే బెటర్‌. గంగాధర్‌ తన 740 సుదీర్ఘ పాదయాత్రకు సార్థకత చేకూరింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. అన్ని కిలో మీటర్లు నడవాలంటే మామూలు విషయం కాదు. ఎంత అభిమానం ఉంటే అంతగా నడుస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజంగా గంగాధర్ మెగా అభిమాని అంటూ నెటిజన్స్‌ కితాబిస్తున్నారు.
Tags:    

Similar News