సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వ ం వహించిన `చిత్రలహరి` ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 13 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా తర్వాత సాయిధరమ్ నటించే సినిమా ఏది? అంటే అందుకు ఇంతవరకూ సరైన ఆన్సర్ లేదు. అయితే రణవీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `గల్లీబోయ్` రీమేక్ లో సాయిధరమ్ నటిస్తారని ప్రచారమైంది. గల్లీబోయ్ రీమేక్ హక్కుల్ని దక్కించుకున్న గీతా ఆర్ట్స్ సంస్థ సాయిధరమ్ హీరోగా ఆ చిత్రాన్ని నిర్మించనుందని మాట్లాడుకున్నారు. అయితే ఇది నిజమా? ఈ చిత్రానికి సాయిధరమ్ సంతకం చేశారా?
ఇదే ప్రశ్న `చిత్రలహరి` ప్రమోషనల్ ఇంటర్వ్యూలో సాయిధరమ్ కి ఎదురైంది. అయితే ఇంతవరకూ తాను గల్లీబోయ్ సినిమానే చూడలేదని సాయిధరమ్ షాక్ ఇచ్చారు. ఆ సినిమాలో నటిస్తున్నానన్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ గాలి వార్తలేనని తేల్చేశారు. తనవైపు వచ్చిన స్క్రిప్టుల్లో ఏది మంచిదో ఎంచుకుని అందులో మాత్రమే నటిస్తున్నానని తెలిపాడు. పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రాల్లో నటించడం లేదు కదా? ఆ తరహా స్క్రిప్టులు వినిపించినా ఓకే చేయడం లేదా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని అన్నారు. నా వైపు వచ్చిన స్క్రిప్టుల్ని వింటున్నాను. వాటిలో నచ్చిన దానిని ఎంపిక చేసుకుంటున్నానని అన్నారు.
చిత్రలహరి.. ఫెయిల్యూర్స్ లో ఉండే హీరో కథాంశం ఇది. ఒకవేళ మీరు సక్సెస్ లో ఉండి ఉంటే ఈ కథను అంగీకరించేవారా? అన్న ఆసక్తికర ప్రశ్నకు సాయిధరమ్ అంతే ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. కథే హీరోని ఎంపిక చేసుకుంటుందని నేను నమ్ముతాను. హీరోతో పాటు ఇతర పాత్రల్ని కథే డిమాండ్ చేస్తుంది. ఆ ప్రకారమే ఎంపికలు సాగుతాయని నమ్ముతాను అని అన్నారు. టైమింగ్ కలిసొస్తే.. ఆ కథ చెప్పిన సమయంలో వెంటనే ఓకే చెప్పేస్తానని సాయిధరమ్ వెల్లడించారు.