ట్రెండీ టాక్‌: మెగా ప్రిన్స్ చేయాల్సిన‌ది కానీ..!

Update: 2021-03-14 02:30 GMT
PSPK 27 .. కోహినూర్ వ‌జ్రం దోపిడీ నేప‌థ్యం.. హిస్టారిక‌ల్ కాన్సెప్ట్ తో నెవ్వ‌ర్ బిఫోర్ విజువ‌లైజేష‌న్ తో సంచ‌ల‌నం సృష్టించ‌డ‌మే ధ్యేయంగా రూపొందుతున్న చిత్ర‌మిది. పాన్ ఇండియా కేట‌గిరీలో అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేసి విజ‌యం అందుకోవాల‌న్న క‌సితో ప‌ని చేస్తున్నారు ప‌వ‌న్ -క్రిష్ బృందం‌. క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ తో స‌త్తా చాటాల‌న్న పంతంతో క్రిష్ ప్ర‌తిదీ ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ చిత్రంలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మ‌ల్ల‌యోధుల‌తో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు స‌హా క‌త్తి పోరాటాలు యుద్ధాల నేప‌థ్యం.. ఓడ‌ల‌పై భారీ వారియ‌ర్ పోరాటాలు.. ఇలా ప్ర‌తిదీ ఉత్కంఠ రేకెత్తించ‌నున్నాయి. అయితే ఈ మూవీ పుట్టుక వెన‌క ఓ టాప్ సీక్రెట్ తాజాగా రివీలైంది.

అస‌లు ఈ క‌థ‌- కాన్సెప్ట్ ప‌వ‌న్ కి ఎలా చేరుకుంది? అన్న‌ది ఆరా తీస్తే.. వాస్త‌వానికి ఈ క‌థ‌ను క్రిష్ మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కోసం రాసుకున్నార‌ట‌. కానీ పాన్ ఇండియా కేట‌గిరీలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో చేయాల్సి ఉంటుంది కాబ‌ట్టి అత‌డి మార్కెట్ కి సింక్ అవ్వ‌ద‌ని సందేహించారు. అలా ఆ త‌ర్వాత ప‌వ‌న్ వ‌ద్ద‌కు చేరుకుంది. క్రిష్ క‌న్విన్స్ చేయ‌గ‌లిగారు. అటుపై ప‌వ‌న్ దీనికోసం స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డి సెట్స్ లో హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు.

నిజానికి క్రిష్ ఈ క‌థ‌తో పాటు జేమ్స్ బాండ్ త‌ర‌హా క‌థాంశాన్ని వ‌రుణ్ తేజ్ కి వినిపించినా అది కూడా వ‌ర్క‌వుట్ కాలేద‌ని తెలిసింది. భారీత‌నం నిండిన కాన్వాస్ బ‌డ్జెట్ల‌తోనే స‌మ‌స్య‌. హీరోల మార్కెట్ అప్ప‌టి ప‌రిస్థితుల క‌నుగుణంగా ప్ర‌తిదీ తెలివిగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ప‌వ‌న్ ని ఎంపిక చేసుకోవ‌డం వెన‌క కార‌ణం ఏదైనా కానీ ఒక గ్రేట్ ఛాన్స్ మిస్స‌య్యాడు వ‌రుణ్‌.
Tags:    

Similar News