ఒకప్పుడు చిరంజీవి, తరువాత రవితేజ, ఇప్పుడు నాని వంటి స్టార్లకు మాత్రం బాగా క్రేజ్ పెరిగి ఒక లాయల్ ఫ్యాన్ బేస్ తో పాటు స్టార్ డమ్ వచ్చాకనే ఈ టైటిళ్ళు అనేవి పెట్టారు. కాని ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న ఈ కొత్త హీరోలకు మాత్రం ఒక్క సినిమా విడుదలైతే చాలు రెండో సినిమా నుండే ఈ టైటిల్ తగిలించేస్తున్నారు. దీనినే టైటిల్ క్రేజ్ అంటారు మరి.
నాగార్జున - మహేష్ - చరణ్.. ఇలా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ ఉన్న బాబులందరికీ రెండో సినిమాకే ఏదో ఒక టైటిల్ వచ్చిపడింది. అయితే అభిమానులు ఇవ్వడం లేకపోతే మీడియా తగిలించడం. ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందిలే. ఇకపోతే.. ఒక ప్రక్కన సూపర్ స్టార్ మహేష్ గత టైటిల్ 'ప్రిన్స్' అని అందరికీ తెలిసినప్పటికీ.. మెగా క్యాంపు మాత్రం కుర్రాడు వరుణ్ తేజ్ కు 'మెగా ప్రిన్స్' అనే టైటిల్ నే పెట్టడానికి ఫిక్సయ్యారా? అంటే అవుననే వినిపిస్తోంది. మనోళ్ళు ఆ టైటిల్ ను 'లోఫర్'తో మనకు పరిచయం చేస్తారేమో.
నిజానికి 'కంచె' సినిమాకే ఈ టైటిల్ తగిలిద్దాం అనుకున్నారట.. కాని ఆ సినిమా కాస్త ఆర్టు సినిమా కావడంతో వద్దులేండి అని వరుణ్ తేజ్ చెప్పడంతో ఆగిపోయారట. లేకపోతే రెండో సినిమాకే టైటిల్ ను సొంతం చేసుకున్న దిగ్గజాల్లో మనోడు కూడా జాయిన్ అయ్యేవాడు. క్రిష్ తీసిన సినిమా కాబట్టి మిస్సయ్యిపోయాడు.