ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటేనే ఆర్థిక పరిపుష్టత కోసం అంటూ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించాలనే నిర్ణయానికి వచ్చాడు. అది కొందరికి నచ్చక పోయినా కూడా ఆయన సినిమాలు చేయడం ఇప్పటికే మొదలు పెట్టాడు. దిల్ రాజు బ్యానర్ లో పింక్ రీమేక్ ను తన 26వ చిత్రంగా చేస్తున్న పవన్ అప్పుడే తన 27వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టాడు. క్రిష్ దర్శకత్వంలో ఏఎం రత్నం దర్శకత్వంలో పవన్ కొత్త సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది.
ఏఎం రత్నం వద్ద చాలా కాలం క్రితం పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ తీసుకున్నాడని.. ఆ కారణంగానే ఇప్పుడు ఆయన బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తర్వాత పవన్ 27ను ఏఎం రత్నం మాత్రమే కాకుండా మెగా కాంపౌండ్ కు చెందిన వారు కూడా ఎవరో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ పుకార్లకు కారణం కూడా ఉంది. పవన్ 27 షూటింగ్ ప్రారంభం సందర్బంగా క్లాప్ బోర్డు పై మెగా సూర్య మూవీస్ అని ఉంది.
ఇది కొత్త బ్యానర్. ఏఎం రత్నం సూర్య మూవీస్ కాని ఇది మెగా సూర్య మూవీస్ కనుక దీంట్లో మెగా ఫ్యామిలీకి చెందిన వారు ఉన్నారేమో అంటూ టాక్ వినిపిస్తుంది. గతంలో పవన్ కళ్యాణ్ తాను వదిన సురేఖ గారి వద్ద డబ్బు తీసుకున్నట్లుగా చెప్పాడు. మరి ఆ డబ్బును తిరిగి ఇచ్చే ఉద్దేశ్యంతో ఆమెను నిర్మాతగా ఇందులో భాగస్వామ్యం చేసే ఉద్దేశ్యంతో ఇలా మెగా సూర్య మూవీస్ బ్యానర్ ను ఏర్పాటు చేసి ఏఎం రత్నం మరియు సురేఖ గార్లకు సెటిల్ చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం పవన్ లేదా నిర్మాత ఏఎం రత్నం నోరు విప్పితే కాని తెలియదు.
ఇక సినిమా విషయానికి వస్తే క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతుంది. ఒక బంది పోటు కథతో ఈ చిత్రం ఉంటుందని.. బందిపోటుగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ చిత్రంలో పవన్ పాత్ర పై యూనిట్ సభ్యుల నుండి అధికారిక క్లారిటీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.