బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ హీరోగా రూపొందిన 'గల్లీబాయ్' చిత్రం ఇటీవల ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక చిన్న సినిమాగా రూపొందిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఉత్తరాదిన ఈ చిత్రానికి ప్రేక్షకులు నిరాజనాలు పడుతున్నారు. ఇండియాలోనే కాకుండా విడుదలైన అన్ని దేశాల్లో కూడా ఈ చిత్రంకు మంచి ఆధరణ దక్కుతుంది. సౌత్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గరగా ఈ కథ ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగా నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడట.
గల్లీబాయ్ విడుదలైన రెండవ రోజే అల్లు అరవింద్ తరపున బన్నీ వాసు రీమేక్ రైట్స్ కోసం మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి రీమేక్ రైట్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అంటూ సదరు చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేసిందట. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేదా కొత్త మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో ఈ ఈ రీమేక్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయంలో మెగా కాంపౌండ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. వరుణ్, చరణ్ పేర్లు కూడా పరిశీలిస్తున్నారు.
రీమేక్ రైట్స్ తీసుకుని, స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసిన తర్వాత ఈ నలుగురిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉందట. గల్లీబాయ్ చిత్రంలో రణ్ వీర్ సింగ్ మంచి నటనతో ఎనర్జిటిక్ బాడీలాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు. ఆ కథ తప్పకుండా తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అల్లు అరవింద్ ఉన్నాడట. తెలుగులోనే కాకుండా తమిళనాట కూడా ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ గల్లీబాయ్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అల్లు అరవింద్ మాత్రమే కాకుండా గల్లీబాయ్ రీమేక్ రైట్స్ కోసం పెద్ద క్యూనే ఉంది. మరి తెలుగులో ఈ రీమేక్ రైట్స్ ఎవరికి దక్కేనో, ఎవరు హీరోగా చేసేనో చూడాలి. ప్రస్తుతానికి గల్లీబాయ్ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న యూనిట్ సభ్యులు రీమేక్ రైట్స్ అమ్మే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.