మెగాస్టార్ చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ `భోలా శంకర్` రిలీజ్ తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్ గా 2023 ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా తేదీని ప్రకటిస్తూ చిత్రబృందం పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో బాస్ ఈజ్ బ్యాక్ అన్న తీరుగా చిరును ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంది.
పోస్టర్ లో చిరు ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. అదే సమయంలో షేడెడ్ గళ్ల చొక్కాతో చేతిలో త్రిశూల్ కీచైన్ ని గిరగిరా తిప్పేస్తూ మాసిజాన్ని మరో లెవల్లో ఆవిష్కరించారు. ఈ లుక్ మెగాభిమానుల్లోకి దూసుకెళుతోంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవుదినం (శుక్రవారం).. ఆ తర్వాత వీకెండ్ ఆద్యంతం ఈ సినిమాకి కలిసి వచ్చేలా రిలీజ్ తేదీని లాక్ చేయడం విశేషం. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా చిరు సినిమాకి ఆ మూడు రోజులు కలెక్షన్ల పరంగా ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం విశేషం. ఒకవేళ హిట్టు అన్న టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ దగ్గర మెగా ప్రభంజనం ఖాయమైనట్టే.
చిరు నటిస్తున్న ఇతర సినిమాల రిలీజ్ తేదీల గురించి చర్చ సాగుతోంది. దసరాకి `గాడ్ ఫాదర్`.. సంక్రాంతికి వాల్టేర్ వీరన్న (వర్కింగ్ టైటిల్) ఫిక్సయినట్టు కథనాలు వెలువడ్డాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటనలు వెలువడాల్సి ఉంది. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ వేసవి సెలవుల్లో ఏప్రిల్ 14 న వస్తున్నారు. బాబి మూవీకి టైటిల్ లాంచ్ తో పాటు డేట్ ని కూడా ప్రకటించాల్సి ఉంటుంది.
భోళా శంకర్ అజిత్ నటించిన వేదాళం చిత్రానికి రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ తో కలిసి రామబ్రహ్మం సుంకర- అనిల్ సుంకరల బ్యానర్ ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిరు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. మెగాస్టార్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది.
హీరోలను స్టైలిష్ గా ఆవిష్కరించడంలో మెహర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకుముందు బిల్లా లో ప్రభాస్ ని ఎంతో స్టైలిష్ గా చూపించిన మెహర్ ఈసారి చిరుని కూడా భోళా శంకర్ లో అంతే స్టైలిష్ గా ఆవిష్కరిస్తున్నారని పోస్టర్లు చెబుతున్నాయి. ట్రెండీ కాస్ట్యూమ్స్ తో మెగాస్టార్‌కి పర్ఫెక్ట్ లుక్ ని డిజైన్ చేయించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. భోలా శంకర్ ఇప్పటివరకు 40శాతం చిత్రీకరణ పూర్తయింది. ఇందులో భావోద్వేగాలు ఇతర కమర్షియల్ అంశాలు సరైన నిష్పత్తిలో ఉంటాయని దర్శకుడు వెల్లడించారు.
ఈ చిత్రానికి డడ్లీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... కథ పర్యవేక్షణ సత్యానంద్ .. సంభాషణలు తిరుపతి మామిడాల.. ఎడిటింగ్ మార్తాండ్ కె వెంకటేష్.. ప్రొడక్షన్ డిజైనింగ్ ఎఎస్ ప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు. కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీ ముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు నటిస్తున్నారు.