మెగాస్టార్ లేఖ వెనుక అసలు లెక్క ఇదేనా? 113 మంది లేఖలు రాయటమా?

Update: 2021-08-11 03:24 GMT
‘మా’ ఎన్నికల విషయంలో తెర వెనుక మాత్రమే ఉండే మెగాస్టార్ చిరంజీవి.. తన తీరుకు భిన్నంగా తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్దిరోజులుగా ‘మా’ ఎన్నికల మీద సాగుతున్న రచ్చను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా చిరునే నేరుగా సీన్లోకి రావటం ఆశ్చర్యానికి గురి చేసింది. గడిచిన కొన్ని దఫాలుగా చిరు డిసైడ్ చేసిన వారే ‘మా’ అధ్యక్ష కుర్చీలో కూర్చుంటున్నారని చెప్పాలి. అంతలా బ్యాక్ గ్రౌండ్ వర్కు చేసే చిరు.. ఈసారి నేరుగా సీన్లోకి రావటం వెనుక అసలు కారణం ఏమిటి? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

‘మా’ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని కోరుతూ.. క్రమశిక్షణ సంఘానికి చిరు లేఖ రాసిన 24 గంటల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. చిరు మాదిరి మరో 113 మంది సభ్యులు ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని కోరటం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ 113 మంది సభ్యులు ఎవరికి వారుగానే లేఖలు రాయాలన్న ఆలోచన వచ్చిందా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చిరు లేఖ ను రాసిన వారిలో అత్యధికులు ఆయన వర్గానికి చెందిన వారేనన్న మాట వినిపిస్తోంది. తమ బలాన్ని లేఖలతో చూపించాలన్న ఉద్దేశంతోనే ఇదంతా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. దగ్గర దగ్గర 900 మంది వరకు సభ్యులున్న ‘మా’ అసోసియేషన్ లో 113 మంది.. చిరుతో కలిపితే 114 మంది లేఖ రాయటం అంటే.. ఇంచుమించు 13 శాతానికి పైగా అసోసియేషన్ సభ్యులు ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని కోరటం చూస్తే.. లేఖలోనే తమకున్న బలాన్ని చిరు కుటుంబాన్ని ప్రదర్శించాలని భావిస్తుందా? అన్నది ప్రశ్నగా మారుతోంది.

మెగా క్యాంప్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. బుధవారం కూడా క్రమశిక్షణ సంఘానికి పెద్ద ఎత్తున లేఖలు వెళతాయని.. ఎన్నికల్ని త్వరగా ప్రకటించాలన్న డిమాండ్ ను మరింత బలంగా వినిపిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. ‘మా’ ఎన్నికల వ్యవహారం సినిమాటిక్ మలుపులు తిరుగుతుందని చెప్పక తప్పదు.




Tags:    

Similar News