మెగాస్టార్‌ చిరంజీవికి శ్రద్దాంజలి ఘటించింది!

Update: 2020-06-08 17:20 GMT
కన్నడ నటుడు చిరంజీవి సర్జా గుండె పోటుతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మృతితో కన్నడ సినిమా పరిశ్రమ ఉలిక్కి పడినది. ఆయన మరణం తీరని లోటు అంటూ పలువురు సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌లు పెట్టారు. ఈ సమయంలోనే కొందరు మెగాస్టార్‌ చిరంజీవి చర్చ సోషల్‌ మీడియాలో తెచ్చారు. చాలా మంది చిరంజీవి అంటూ పోస్ట్‌ పెట్టడం ఫొటోలు ట్యాగ్‌ చేయక పోవడంతో పొరబడుతున్నారు. అయితే ప్రముఖ రచయిత శోభా డే ఏకంగా ఫొటోనే మార్చి పెట్టింది.

మెగాస్టార్‌ చిరంజీవి ఫొటోను షేర్‌ చేసి ఆమె శ్రద్దాంజలి ఘట్టిస్తున్నట్లుగా పోస్ట్‌ పెట్టింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలి, మీ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ పోస్ట్‌ పెట్టింది. క్షణాల్లో ఆ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. తన తప్పును తెలుసుకున్న ఆమె వెంటనే ఆ పోస్ట్‌ ను డిలీట్‌ చేసింది. అయినా కూడా మెగా ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి.

పెద్ద రచయితగా పేరున్న మీకు కనీస అవగాహణ లేదా. బతికి ఉన్న వ్యక్తి ఫొటో పెట్టి శ్రద్దాంజలి ఘటిస్తున్నాను అంటూ పోస్ట్‌ పెట్టడం మీ తెలివి తక్కువ తనం కాదా అంటూ ఎద్దేవ చేశారు. మొత్తానికి చిరంజీవి పేర్లు సేమ్‌ ఉండటంతో కాస్త గందరగోళం క్రియేట్‌ అయ్యింది. ఇదే సమయంలో శోభా డే చేసిన పోస్ట్‌ మరింత దుమారంను రేపుతోంది.
Tags:    

Similar News