తెలుగు ... తమిళ భాషల్లో సీనియర్ డైరెక్టర్ గా సురేశ్ కృష్ణకి మంచి పేరు ఉంది. తమిళంలో ఆయన నుంచి అనేక హిట్ చిత్రాలు వచ్చాయి. కమల్ .. రజనీ వంటి స్టార్ హీరోలకు భారీ విజయాలను అందించినవారాయన. తమిళంలో ఆయన తెరకెక్కించిన 'బాషా' సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన ప్రతి భాషలో ఈ సినిమా విజయవిహారం చేసింది. రజనీ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత అదే కాన్సెప్ట్ తో అనేక సినిమాలు రావడానికి, 'బాషా' కారణమైంది.
ఇక తెలుగులో సురేశ్ కృష్ణ తెరకెక్కించిన 'ప్రేమ' .. 'ఇంద్రుడు చంద్రుడు' .. 'మాస్టర్' సినిమాలు ఆయన దర్శక ప్రతిభకు అద్దం పడుతూ ఉంటాయి. అలాంటి సురేశ్ కృష్ణ తాజా ఇంటర్వ్యూ లో 'మాస్టర్' సినిమాను గురించి ప్రస్తావించారు. "తెలుగులో కూడా 'బాషా' పెద్ద హిట్ అయిన తరువాత, నేను 'భూపతిరాజా' కథను చిరంజీవిగారికీ ... అల్లు అరవింద్ గారికి వినిపించాను. ఆ కథ వాళ్లిద్దరికీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బాలచందర్ గారి దర్శకత్వంలో చిరంజీవిగారు 'రుద్రవీణ' చేస్తున్నప్పుడు, నేను అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నాను. అప్పటి నుంచి నాకు చిరంజీవిగారు తెలుసు. 'మాస్టర్'తో ఆయనను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినందుకు చాలా సంతోషపడ్డాను.
ఈ సినిమాకి ఫస్టాఫ్ లో యాక్షన్ ఎక్కువగా ఉండదు. స్టూడెంట్స్ తో 'మాస్టర్' సరదాగా ఉంటారు అంతే. అందువలన ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచించి, మాస్టర్ కీ .. స్టూడెంట్స్ కి మధ్య సరదాగా ఓ సాంగ్ ఉంటే బాగుంటుందని అనుకున్నాను. ఆ పాటను చిరంజీవిగారు పాడితేనే కొత్తగా .. స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుందని భావించాను. సంగీత దర్శకుడు 'దేవా' కూడా ఐడియా బాగుందని అన్నారు. ఇద్దరం కలిసి చిరంజీవిగారితో ఆ మాట చెబితే, ఆయన పాడనంటే పాడనన్నారు. మీరు పాడటానికి అనుకూలంగా ఈ పాట ఉంటుందని బ్రతిమాలుతూనే, బలవంతంగా రికార్డింగ్ థియేటర్ కి తీసుకెళ్లి మైక్ ముందు నిలబెట్టాం. ముందు ఇబ్బందిపడినా ఆ తరువాత ఆయన ఎంజాయ్ చేస్తూ పాడారు" అని చెప్పుకొచ్చారు.