మెగాస్టార్ చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ 'లూసిఫర్' తెలుగు రీమేక్ లో నటించనున్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా బ్యానర్స్ పై ఆర్.బి చౌదరి - ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'తని వరువన్' ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. థమన్ సంగీతం అందించనున్నారు. చిరంజీవి కెరీర్ లో 153వ చిత్రంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని బుధవారం ఫిలిం నగర్ లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ - అశ్వినీ దత్ - డీవీవీ దానయ్య - నిరంజన్ రెడ్డి - నాగబాబు, కొరటాల శివ - జెమినీ కిరణ్ - రచయిత సత్యానంద్, మెహర్ రమేష్ - బాబీ - రామ్ ఆచంట - గోపి ఆచంట - మిర్యాల రవీందర్ రెడ్డి - నవీన్ యెర్నేని - శిరీష్ రెడ్డి - యూవి క్రియేషన్స్ విక్కీ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు ఆర్బీ చౌదరి - ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. మన నేటివిటీకి తగ్గట్టుగా ఈ ప్రతిష్ఠాత్మక స్క్రిప్టును మోహన్ రాజా అద్భుతంగా సిద్ధం చేసారు. మెగాస్టార్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుంది'' అన్నారు. మోహన్ రాజా మాట్లాడుతూ.. 'చిరంజీవి గారి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. అభిమానులు కోరుకునే రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది. ఇది పూర్తిస్థాయి రీమేక్ సినిమా కాదు. ఆ కథను తీసుకుని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నాం. మిగతా నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని చెప్పుకొచ్చారు.