ఆరుగురు యంగ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్ తో మెగాస్టార్!

Update: 2022-04-27 00:30 GMT
మెగాస్టార్‌ చిరంజీవి ఈమద్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఇప్పటి వరకు సీనియర్ దర్శకులు ఎన్నో పాత్రల్లో చూపించారు. అయితే యంగ్‌ దర్శకులు నన్ను.. నా సినిమాలను చూసి పెరిగారు కనుక వారితో సినిమాలు చేయాలనుకుంటున్నాను.. అందుకే యంగ్‌ దర్శకులకు అవకాశం ఇస్తాను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అన్నట్లుగానే వరుసగా యంగ్‌ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు.

వెంకీ కుడుముల.. బాబీ.. మెహర్‌ రమేష్ ఇలా ఇంకా పలువురు యంగ్‌ డైరెక్టర్స్ కు చిరంజీవి అవకాశం ఇచ్చాడు. ముందు ముందు మరింత మందికి అవకాశం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకులు కూడా వరుసగా చిరంజీవి తో సినిమాలను చేసేందుకు కథలు సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మంచి కథ ఉంటే చాలు తప్పకుండా చేద్దాం అన్నట్లుగా చిరంజీవి ఉంటున్నాడు.

యంగ్‌ దర్శకులతో మరింతగా చేరువ అయ్యేందుకు గాను వారి సినిమాల యొక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్‌ సినిమా ప్రమోషన్ లో చిరంజీవి మాట్లాడుతూ యంగ్‌ డైరెక్టర్స్ యొక్క ప్రతిభను గురించి చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ యంగ్‌ డైరెక్టర్స్ ను జనాల్లోకి మరింతగా తీసుకు వెళ్లేందుకు చిరంజీవి మరో అడుగు వేశారు.

ఈ వారంలో విడుదల కాబోతున్న ఆచార్య సినిమా విడుదల సందర్బంగా పలు ప్రమోషనల్‌ ఇంటర్వ్యూలను చిరంజీవి ఇస్తున్నాడు. అందులో భాగంగా యంగ్ దర్శకులు అయిన వివేక్ ఆత్రేయా.. వెంకటేష్ మహా.. సందీప్ రాజ్.. వినోద్‌ అనంతోజు.. శైలేష్ కోనేరు.. స్వరూప్‌ ఆఎస్జే.. వీరు అంతా కూడా మెగాస్టార్‌ కు వీరాభిమానులం అంటూ చెప్పుకుంటూ ఉంటారు.

తన అభిమానులు ఇలా యంగ్‌ డైరెక్టర్స్ గా.. అది కూడా ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్ గా మారడం పట్ల చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటాడు. తాజాగా వారితో ఆచార్య గురించి మాట్లాడుతూ వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ ను అతి త్వరలోనే మీడియాకు చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఇంటర్వ్యూ చాలా స్పెషల్‌ గా ఉంటుందని అంటున్నారు.
Tags:    

Similar News