ఆఫర్లు బాగానే వస్తున్నాయి

Update: 2018-02-12 18:30 GMT
సినిమా ఇండస్ట్రీలో హిట్లు పెడితేనే భవిష్యత్తు ఉంటుందనేది పాత కాలం మాట. టాలెంట్ ఉండాలే గాని రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రస్తుతం ఆ విధంగా వచ్చిన సినీ తారలు చాలా మంది ఉన్నారు. హీరోయిన్స్ కూడా దాదాపు ఇదే తరహా లైన్ లో వెళుతున్నారు. మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ  అవకాశాలను బాగానే అందుకుంటున్నారు. ఆ లిస్ట్ లో లై బ్యూటీ కూడా చేరింది.  

గత ఏడాది భారీ బడ్జెట్ తో వచ్చిన నితిన్ లై సినిమా హిట్ అవుతుందని అందరు అనుకున్నారు. ముఖ్యంగా ఆ సినిమాలో నటించిన మేఘా ఆకాష్ మొదటి లుక్ తోనే అందరిని ఆకర్షించింది. గ్లామర్ డోస్ ని కూడా గట్టిగానే ఇచ్చింది. కానీ సినిమా డిజాస్టర్ అవ్వడంతో అమ్మడి పని కూడా అయిపోయిందని అందరు అనుకున్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా మేఘా వరుస అవకాశాలను అందుకుంటోంది. ఇప్పటికే నితిన్ తో రెండవ అవకాశాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ బ్యాక్ గ్రౌండ్ తో రాబోతోన్న ఆ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక ఆ సినిమాతో పాటు మెగా స్టార్ అల్లుడు కళ్యాణ్ చేయబోయే సినిమాలో కూడా అమ్మడు నటిస్తోంది. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం లై బ్యూటి మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది, నిఖిల్ చేయబోయే కనిథన్ రీమేక్ లో మేఘా అయితే బెస్ట్ అని ఒకే చేసినట్లు సమాచారం. ఇంతకుముందు క్యాథెరిన్ ను అనుకున్నప్పటికీ ఆమె ఎందుకో గాని సెట్ అవ్వలేదు. ఇక మొత్తంగా మేఘా వరుసగా ఆఫర్లను అందుకుంటుంది అనేది వాస్తవం.    
Tags:    

Similar News