పూరి జగన్నాథ్ గత సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపించడంతో ‘మెహబూబా’ ఆయన రాత మార్చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ అంచనాలు ఎంతమాత్రం ఫలించలేదు. పూరి గత సినిమాలకు దీటుగానే టాక్ తెచ్చుకుందీ చిత్రం. పూరి ఇంతకుముందు స్టార్లతో సినిమాలు చేశాడు.. పైగా వాటిలో మాస్ ప్రేక్షకుల్ని అలరించే అంశాలు కూడా ఉండేవి కాబట్టి సినిమాలు ఎలా ఉన్నప్పటికీ కనీసం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. కానీ ‘మెహబూబా’ విషయంలో అదీ లేదు. పూరి ఆకాశ్ కొత్తవాడు.. పైగా ఇది సీరియస్ కావడంతో కనీసం ఓపెనింగ్స్ కరవయ్యాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అటు అమెరికాలో ఈ సినిమా పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ సినిమా బాగా ఆడేస్తుందన్న నమ్మకంతో అమెరికాలో మంచి వసూళ్లు తెచ్చుకుందామన్న ఆశతో పూరి సహా చిత్ర బృందమంతా కలిసి రెండు వారాల యుఎైస్ టూర్ ప్లాన్ చేసింది. ప్రిమియర్ల నుంచే అక్కడ సందడి చేసింది.
కానీ ఫలితం లేకపోయింది. ‘మెహబూబా’ అక్కడ కనీస ప్రభావం చూపలేకపోయింది. ప్రిమియర్లతోనే బ్యాడ్ టాక్ మొదలవడంతో జనాలు థియేటర్లకు రావడం కష్టమైపోయింది. గురు.. శుక్ర.. శనివారాల్లో కలిపి ఈ చిత్రం అక్కడ 71,788 వేల డాలర్లు మాత్రమే వసూలు చేసింది. కొత్త సినిమాలకు అత్యధిక వసూళ్లు వచ్చే శనివారం రోజు ఈ చిత్రం కేవలం 12,260 డాలర్లు మాత్రమే వసూలు చేసింది. కానీ ఇదే రోజు ‘మహానటి’ సినిమా ఏకంగా 4.23 లక్షల డాలర్లు కొల్లగొట్టింది. ఎక్కడ 12 వేలు.. ఎక్కడ 4 లక్షలు. ఒకే వారాంతంలో విడుదలైన రెండు కొత్త సినిమాల మధ్య అంతరమిది. దీన్ని బట్టే పూరి సినిమా పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కానీ పూరి అండ్ కో మాత్రం గొప్ప సినిమా తీసినట్లు.. ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వచ్చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటోంది. ఫుల్ రన్లో ‘మెహబూబా’ వసూళ్లు ఈ చిత్ర బృందం అమెరికా పర్యటనకు అయిన ఖర్చులకైనా సరిపోయేలా ఉంటాయా అన్నది సందేహం.