టీకా అత్యావశ్యకం. టీకా వేయనిదే షూటింగుకి అనుమతించరు. బయట తిరిగేందుకు ఇక అర్హత కోల్పోవాలి. అందుకే సినీతారలు ఒక్కొకరుగా వ్యాక్సినేషన్ బాట పడుతున్నారు. టీకా వేసుకోవడమే కాకుండా అదే సమయంలో వ్యాక్సినేషన్ పై సామాన్య ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవలే నేచురల్ స్టార్ నాని.. మాళవిక మోహనన్.. రాయ్ లక్ష్మీ లాంటి ప్రముఖులు టీకా వేయించుకుని సోషల్ మీడియా వేదికగా టీకా గురించి అవేర్ నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసారు. ఇంకా వ్యాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారు తమ అనుభవాన్ని చెప్పుకొచ్చారు. తాజాగా నటి మెహరీన్ కూడా తొలి డోసు టీకా తీసుకున్నారు. తన స్టాప్ తో కలిసి మెహరీన్ టీకా వేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
అలాగే వీలైనంత త్వరగా ప్రజలంతా కూడా రెండు డోసుల టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని సూచించారు. మరో విలువైన మాటను కూడా మెహరీన్ పంచుకున్నారు. టీకా అందరూ విధిగా వేసుకోవాలి. దీన్ని నేషనల్ డ్యూటీగా భావించి చేయాలని మెహరీన్ పేర్కొంది. అయితే మెహరీన్ టీకా తీసుకునే సమయంలో ఎక్కువగానే భయపడినట్లు కనిపిస్తోంది.
మెహరీన్ ఫోటోని సైతం షేర్ చేసి టీకా అనుభవాన్ని పంచుకోవడంతో ఆ సంగతి అర్థమైంది. ఇంతకుముందు రాయ్ లక్ష్మీ మాళవిక మోహనన్ కూడా టీకా వేస్తుంటే కాస్త భయానికి గురయ్యారు. వ్యాక్సినేటర్ టీకా (ఇంజెక్షన్) వేసే సమయంలో మెహరీన్ బాగా కంగారు..ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. పెరిగి పెద్దయ్యాక వేయించుకున్న మొదటి టీకా..చివరి టీకా కూడా ఇదేనేమో అని వ్యాఖ్యానించారు.
టీకా తీసుకునే సమయంలో చాలా మంది మహిళల్లో ఈ కంగారు కనిపిస్తోంది. బహుశా ఆ ఆందోళన పెరిగి పెద్దైన తర్వాత వేసుకున్న తొలి టీకా కావడం వలనే. సాధారణంగా టీకాలు చిన్న వయసులో( నెలల వయసులోనే) వేసేస్తారు. ఎనిమిది- తొమ్మిది రకాల వ్యాధులకు టీకాలు నెల నుంచి మూడు నెలలోపే వేసేస్తారు. ఆ వయసు లో టీకా అంటే తెలియదు. ఇప్పుడు కరోనా మహమ్మారి కారణంగా టీకా గురించి ప్రతీ ఒక్కరికి తెలుసొచ్చింది. సెకండ్ వేవ్ లో కరోనా సోకడంతో మెహ్రీన్ పెళ్లి వేడుక వాయిదా పడిన సంగతి తెలిసిందే.