కాబోయే పెళ్లి కూతురు క‌విత వెన‌క అల‌జ‌డి

Update: 2021-06-01 06:30 GMT
కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ తో మార్చి లో మెహ్రీన్ కౌర్ ఫిర్జ‌దా నిశ్చితార్థం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట పెళ్లి ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈలోగానే అనూహ్యంగా కాబోయే వ‌ధూవ‌రులు క‌రోనా భారిన ప‌డ్డారు. అనంత‌రం చికిత్స తో కోలుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత స‌డెన్ గా పెళ్లి ఆలోచన ఇప్పుడే లేదు.. కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని మెహ్రీన్ స‌డెన్ షాకిచ్చింది. కోవిడ్ వ‌ల్ల కావాల్సిన వాళ్లు పోయిన‌ప్పుడు కాస్త ఆగ‌డమే స‌రైన‌ది అని కూడా తెలిపింది. ఇక త‌నకు కోవిడ్ సోక‌గానే కాబోయే వాడు త‌న‌కు అండ‌గా నిలిచాడ‌ని.. అత‌డికి కోవిడ్ సోకిన‌ప్పుడు త‌న‌ని ప‌రామ‌ర్శిస్తూ నిరంత‌రం త‌న వెంటే ఉన్నాన‌ని మెహ్రీన్ తెలిపారు.

ఇటీవ‌లే కోవిడ్ అనంత‌ర దుష్ప‌రిణామాల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు డిటాక్స్ ట్రీట్మెంట్ (శ‌రీరంలో విష ర‌సాయ‌నాల తొల‌గింపు ప్రిక్రియ‌) ని కూడా పూర్తి చేసిది. అందుకు సంబంధించిన ఫోటోని కూడా మెహ్రీన్ ఇన్ స్టాలో షేర్ చేసింది. తాజాగా మ‌రో క‌ళాత్మ‌క డిజైన‌ర్ లుక్ తో ఫోటోని షేర్ చేసి దానికి అంతే ఆస‌క్తిక‌ర పోయెట్రీని జోడించింది.

``ఒక రోజు ఆమె భయంకరమైనది.. బలమైనది.. ఫుల్ ఫైర్ తో నిండినది అని ఆమె కనుగొంది. ఆమె తనను తాను వెనక్కి తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఆమె అభిరుచి ఆమె భయాల కంటే ప్రకాశవంతంగా వెలుగుతోంది`` అంటూ క‌విత‌ను షేర్ చేయ‌గా దీనిని అభిమానులు వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. మెహ్రీన్ క్రిస్ట‌లైన్ పింక్ డిజైన‌ర్ డ్రెస్ లో నిజంగా రాజ‌కాంత‌నే త‌ల‌పిస్తోంది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు.. కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌ తో కొంత‌కాలంగా ప్రేమ‌లో ఉన్న మెహ్రీన్ స‌డెన్ గా పెళ్లి విష‌యాన్ని బ‌హిర్గ‌తం చేయ‌డంతో అభిమానులు ఖంగు తిన్నారు. మెహ్రీన్ త‌దుప‌రి టాలీవుడ్ లో ఎఫ్ 3 చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉంది.





Tags:    

Similar News