పెళ్లి అంటే ఆషామాషీ తంతు కాదు. అన్నీ కలవాలి. ఇరు కుటుంబాల సాంప్రదాయం.. అభిప్రాయాలు.. పద్ధతులు.. విధి విధానాలు.. ఒకటేమిటి అన్నీ కలిసినా చివరికి మనసులు కలవకపోయినా ఇబ్బందే. ఏదో ఒక చోట తేడా కొడితే ఆ బంధం నిలబడడం అంత సులువేమీ కాదు. కలవగానే లవ్వు అంటూ ఫోటోషూట్లు చేయించుకుని నిశ్చితార్థ అంగుళీకం తొడిగేస్తే సరిపోదు. అంతకుమించి చాలా ఉంటాయి.
ఒకరిది సనాతన సాంప్రదాయాలకు విలువిచ్చే కుటుంబం అయితే మరొకరిది అల్ట్రా మోడ్రన్ ఫ్యామిలీ అనుకోండి.. ఆ రెండూ కలవడం సులువేమీ కాదు. ఇప్పుడు అలాంటి సమస్యే మెహ్రీన్ నిశ్చితార్థం రద్దు చేయడానికి కారణమా? అసలు ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణమేమిటి? ఇది సడెన్ గా తీసుకున్న నిర్ణయమా? అంటూ అభిమానుల్లో సందేహాలు నిలువనీయడం లేదు. అసలు వరుడి తో అతడి కుటుంబంతో చాలా కాలంగా మెహ్రీన్ కి ఆమె కుటుంబానికి సరిపడడం లేదని... చాలా విషయాల్లో అభిప్రాయ బేధాలొచ్చాయని కథనాలొస్తున్నాయి.
ఇక పెళ్లి తర్వాతా నటిస్తానని చెప్పిన మెహ్రీన్ కి వరుడు భవ్య బిష్ణోయ్ కుటుంబీకుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైందని కథనాలు వేడెక్కిస్తున్నాయి. వారిది సాంప్రదాయ బిహారీ కుటుంబం. పైగా రాజకీయంగా గొప్ప పలుకుబడి ఉన్న ఫ్యామిలీ. అందువల్ల ఇరు కుటుంబాలకు అస్సలు పొసగలేదని అందుకే ఇలా అర్థాంతరంగా పెళ్లిని రద్దు చేసుకున్నారని మీడియాల్లో కథనాలొస్తున్నాయి.
పెళ్లి క్యాన్సిల్ అంటూ ఆల్ ఆఫ్ సడెన్ గా చెప్పలేదు. ముందు నుంచి విభేధాలున్నాయి... చాలా కాలం క్రితమే ఈ పెళ్లి అవ్వదని తెలిసి మెహ్రీన్ హైదరాబాద్ కి షిఫ్టయి కెరీర్ పై దృష్టి సారించిందని ప్రచారం సాగుతోంది. ఎఫ్ 3 దర్శకుడితో హైదరాబాద్ లో ఇంతకుముందు ప్రత్యక్షమైందంటే కారణం అక్కడ పెళ్లిపై ఇంట్రెస్ట్ లేకే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే యువహీరో సంతోష్ శోభన్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న చిత్రానికి మెహ్రీన్ సంతకం చేశారు. తనే స్వయంగా ఆ ఆఫర్ ని అడిగి మరీ బిజీ అయిపోయిందట. నిశ్చితార్థం అయ్యాకా క్యాన్సిల్ చేయాలా వద్దా? అన్న డైలమాలోనే మెహ్రీన్ ఇలా ప్రవర్తించారని కథనాలు వెలువడుతున్నాయి. విదేశాల్లో చదువుకున్న మెహ్రీన్ పోష్ కల్చర్ కూడా పెళ్లి కొడుకు తరపు వారికి అంతగా కనెక్టవ్వలేదన్న ముచ్చటా వినిపిస్తోంది. అయితే తమ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక గోప్యతను గౌరవించాలని మెహ్రీన్ కోరారు. తనకు తానుగానే మీడియాలో వెల్లడించే వరకూ ఇవన్నీ కేవలం ఊహాగానాలుగానే భావించాలి. అధికారికంగా మెహ్రీన్ వెల్లడించాల్సి ఉంటుంది.